హైదరాబాద్:
ఢిల్లీ పర్యటన గుట్టు విప్పాలని వైయస్ జగన్ నాయకత్వంలోని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జూపూడి ప్రభాకర
రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని
డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం చంద్రబాబు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. చంద్రబాబు
కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని చెప్పడానికి ఢిల్లీ పర్యటనే నిదర్శనమని ఆయన గురువారం మీడియా
ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
విద్యుత్
చార్జీల పెంపునకు నిరసనగా చేపట్టిన ధర్నాలు చంద్రబాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని, అటు నుంచి అటే
చంద్రబాబు ఆఘమేఘాల మీద ఢిల్లీ బయలుదేరి
వెళ్లారని ఆయన గుర్తు చేస్తూ
ఇది దేనికి సంకేతమని అడిగారు. ఢిల్లీలో చంద్రబాబు ఎవరెవరిని కలిశారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
అవినీతి
నిరోధక శాఖ (ఎసిబి) అధికారి
శ్రీనివాస రెడ్డి ఎవరో తనకు తెలియదని
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అనడాన్ని
ఆయన తప్పు పట్టారు. ఈ
వ్యాఖ్యల ద్వారా బొత్స సత్యనారాయణ తన
అవివేకాన్ని బయటపెట్టుకున్నారని ఆయన అన్నారు. ఇలాంటి
వ్యక్తి రేపు వైయస్ రాజశేఖర
రెడ్డి ఎవరని అడిగినా అశ్చర్యపోవాల్సిన
అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో
పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆయన అన్నారు.
మాజీ
పార్లమెంటు సభ్యుడు గిరజాల వెంకటస్వామి నాయుడు గురువారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమక్షంలో
ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ప్రజా సమస్యలపై వైయస్
జగన్ చేస్తున్న పోరాటమే తనను వైయస్సార్ కాంగ్రెసు
పార్టీలో చేరేలా చేసిందని వెంకటస్వామి నాయుడు అన్నారు. బెంజి తెలుసు, గంజి
తెలుసు అని మెగాస్టార్ చిరంజీవి
మోసం చేశారని ఆయన విమర్శించారు.
0 comments:
Post a Comment