అమెరికాకు
చెందిన "టెర్రాఫుజియా" రూపొందించిన "ట్రాన్సిషన్" ఫ్లయింగ్ కారును ప్రస్తుతం న్యూయార్క్లో జరగనున్న "2012 న్యూయార్క్ ఇంటర్నేషల్
ఆటో షో"లో కంపెనీ ప్రజల
సందర్శనార్ధం ప్రదర్శకు ఉంచింది. అంతేకాకుండా ఈ కారు ధరను
కూడా టెర్రాఫుజియా వెల్లడించటం జరిగింది. ఈ ఫ్లయింగ్ కారు
అత్యంత ఖరీదైన లగ్జరీ కార్ల ధర కన్నా
కూడా తక్కువే.
ట్రాన్సిషన్
ధరను 2,79,000 అమెరికన్ డాలర్లుగా (మన దేశ కరెన్సీలు
సుమారు 1.4 కోట్లకు పైమాటే) నిర్ణయించామని, వచ్చే ఏడాది మార్చి
నుండి వాణిజ్య పరంగా ఈ మోడల్ను అందుబాటులోకి తీసుకువస్తామని
టెర్రాఫుజియా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్)
క్లిఫ్ అల్లెన్ తెలిపారు.
ఇటు ఎఫ్ఎఫ్ఏ (ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్) మరియు ఎన్హెచ్టుఎస్ఏ (నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ
అడ్మనిస్ట్రేషన్) స్టాండర్డ్లను పాటించే ప్రపంచంలోనే
మొట్టమొదటి ఫ్లయింగ్ కారు తమదేనని ఆయన
తెలిపారు. దీంతో ఇది మొదటి
"స్ట్రీట్ లీగల్ ఏరోప్లేన్"గా
నిలించిదని క్లిఫ్ తెలిపారు. ట్రాన్సిషన్ కోసం ఇప్పటికే బలమైన
విచారణ వస్తున్నాయని ఆయన అన్నారు.
రోడ్డుపై
గంటకు 65 మైళ్ల వేగంతో ప్రయాణించే
ట్రాన్సిషన్, గాలిలో 115 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.
'ట్రాన్సిషన్ రోడబుల్ లైట్ స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్'గా
పిలిచే ఎగిరే కారు కేవలం
30 సెకన్ల వ్యవధిలోనే తన రూపాన్ని మార్చుకొని
పక్షిలా రెక్కలు విప్పుకొని గాల్లోకి రివ్వున ఎగిరిపోగలదు. ఈ కారును ట్యాంక్
ఫుల్ చేయించుకుని 110 మైళ్ల వేగంతో గాల్లో
ప్రయాణించినట్లయితే, సుమారు 460 మైళ్ల దూరం వరకూ
వెళ్లవచ్చు.
రెండు
సీట్లు, నాలుగు చక్రాలు కలిగిన తేలికరకం ఎయిర్ క్రాఫ్ట్ను గాలిలో నడపటానికి
కేవలం 20 గంటల ట్రైనింగ్ తీసుకుంటే
సరిపోతుంది. 2012 న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షో ఏప్రిల్
6 నుండి 15 వరకూ జరగనుంది.
0 comments:
Post a Comment