మర్డర్
సినిమాలో రెచ్చి పోయి అందాలు ఆరబోయడంతో
పాటు, ఘాటైన ముద్దు సీన్లతో
కుర్రకారుకి మత్తెక్కించిన మల్లికా షెరావత్ ఆతర్వాత ఐటం తార అవతారం
ఎత్తి సెక్స్ బాంబుగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
ఆ మధ్య బాలీవుడ్లో చాలా
కాలం పాటు మల్లికా హవా
కొనసాగింది. టాలీవుడ్ టాప్ హీరోలంతా ఏరి
కోరి ఈ సెక్స్ బాంబుతో
మాస్ మసాలా సాంగ్స్ చేయించుకున్నారు.
ఆతర్వాత
పోటీ పెరగడం, హీరోయిన్లు సైతం ఐటం సాంగులు
చేయడానికి ఎగబడుతుండటం మల్లిక హవా తగ్గింది. కత్రినా,
కరీనా లాంటి వారు రంగంలోకి
దిగాక మల్లిక పాపులారిటీ కూడా కొంత వరకు
తగ్గిందనే చెప్పాలి. దీనికి తోడు మల్లిక నటించిన
చాలా సినిమాలు ప్లాపవడం కూడా ఆమెకు మైనస్
గా మారింది.
ఈ దెబ్బతో ఆ మధ్య కొన్ని
రోజుల పాటు మల్లికా తెరకు
దూరమైంది. 2009లో ఈ శృంగార
తార ఒక్క సినిమాలో కూడా
నటించలేదు. 2010లో హిస్ అనే
చిత్రంలో మాత్రమే నటించింది. గత సంవత్సరం నుంచి
మళ్లీ పుంజుకున్న మల్లిక షెరావత్ మళ్లీ గాడిలోకి వస్తోంది.
మళ్లీ మల్లికపై జనాల్లో ఇంట్రెస్టు పెరుగుతుండటంతో ఆమెతో రియాల్టీషో చేయించడానికి
పలు కార్పొరేట్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నుంచి
అందిన సమాచారం ప్రకారం ఓ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్
హౌస్ ఆమెకు భారీ అమౌంట్
ఆఫర్ చేస్తూ ఆమె ముందు రియాల్టీ
షో ప్రతిపాదన ఉంచింది. అయితే మల్లిక దానిపై
ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. రియాల్టీషోలోకి అడుగుపెడితే తన సినీ కెరీర్
దెబ్బతింటుందనే ఆలోచనలో ఉందనట. మరో వైపు అంత
పెద్ద అమౌంట్ ఆఫర్ ను కూడా
వదులుకోవడానికి ఆమె మనసు ఒప్పడం
లేదట. మరి చివరకు ఎలాంటి
నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
0 comments:
Post a Comment