వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు, రానున్న ఉప ఎన్నికలకు లింక్
పెట్టి ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వర్గం నేతలపై ఇటీవల
వేటు పడిన విషయం తెలిసిందే.
చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో తిరుపతి స్థానం ఖాళీ అయింది. దీంతో
త్వరలో పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి
ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే
ఉప ఎన్నికలకు ముందు జగన్ అరెస్టుపై
ప్రభుత్వం పెద్దలు తర్జన భర్జన పడుతున్నారని
అంటున్నారు. రెండు రోజుల క్రితం
సిబిఐ జగన్ ఆస్తుల కేసులో
కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం
తెలిసిందే. అందులో జగన్ను సిబిఐ
ఎ-1 నిందితుడిగా పేర్కొంది. దీంతో జగన్ను
ఎందుకు అరెస్టు చేయలేదనే విమర్శలు ప్రతిపక్షం నుండి వినిపిస్తున్నాయి. అయితే
ఇప్పటికే జగన్ పైన ప్రజల్లో
సానుభూతి ఉందని, ఇలాంటి పరిస్థితిల్లో అతన్ని అరెస్టు చేస్తే ఉప ఎన్నికల వరకు
మరింత సానుభూతి పెరిగి కాంగ్రెసు పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయని పలువురు భావిస్తున్నారని అంటున్నారు.
అంతేకాకుండా
జగన్ను అరెస్టు చేస్తే
ఏర్పడే పరిణామాల పైనా ఆందోళన చెందుతున్నారట.
ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు జగన్ను
అరెస్టు చేస్తే ప్రజలు ఎదురు తిరుగుతారని హెచ్చరికలు
జారీ చేశారు. ఈ నేపథ్యంలో జగన్పై ఉప ఎన్నికల
ఫలితాలను అనుసరించి నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఉన్నారని అంటున్నారు. రానున్న ఉప ఎన్నికల్లో జగన్
పార్టీ అభ్యర్థులకు మెజార్టీ తగ్గినా, ఓడిపోయినా అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నారట. అలా కాకుండా జగన్ను తమ గూటికి
తెచ్చుకునేందుకు కూడా కాంగ్రెసు పెద్దలు
ప్రయత్నిస్తున్నారనే వాదన ఉంది. ఇప్పటికే
శరద్ పవార్, మమతా బెనర్జీ వంటి
వారు కాంగ్రెసు నుండి బయటకు వెళ్లి
సొంత కుంపటి పెట్టుకున్నారు. కానీ కాంగ్రెసు వారిని
దగ్గరకు చేర్చుకుంది. జగన్ విషయంలోనూ అదే
జరగవచ్చునని కొందరు అంటున్నారు.
0 comments:
Post a Comment