ఇస్లామాబాద్:
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విషయంలో పాకిస్తాన్ తన మొండివైఖరిని విడనాడుతున్నట్లు
కనిపించడం లేదు. జమాత్ - ఉద్
- దవా చీఫ్ హఫీజ్ సయీద్
తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా
అలా ప్రకటించిన తర్వాత సయీద్కు పాకిస్తాన్
భద్రతను పెంచింది. జౌహార్ పట్టనంలోని బ్లాక్ నివాసం వద్ద జమాత్ - ఉద్
- దవా సాయుధ కార్యకర్తలతో పాటు
పంజాబ్ పోలీసు విభాగానికి చెందిన తొమ్మిది మంది కాపలా కాస్తున్నారు.
సయీద్కు భద్రత పెంచాలని
తాము పోలీసులను అడగలేదని జమాత్ నాయకులు అంటున్నారు.
సయీద్కే కాకుండా అతని
బావమరిది అబ్దుల్ రెహ్మాన్ మక్కీకి కూడా భద్రత పెంచారు.
సయీద్ తలపై బహుమతి ప్రకటించడం
ముస్లింలపై, ఇస్లామ్పై అమెరికా మరో
దాడి అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
సయీద్ భద్రతకు మూడు బారికేడ్లు ఏర్పాటు
చేసి, జమాత్ కార్యకర్తలు కాపలా
కాస్తుంటారు.
నిస్పృహతోనే
అమెరికా తనపై బహుమతి ప్రకటించిందని
సయీద్ అన్నారు. నాటో సరఫరాలకు, ద్రోన్
దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతండడంతో అమెరికా నిస్పృహకు గురవుతోందని ఆయన అన్నారు. అమెరికాపై
సయీద్ తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే పాకిస్తాన్ సయీద్కు సహకరిస్తున్నట్లే
కనిపిస్తోంది.
26/11 ముంబై
ఘటనకు పథక రచన చేసిన
లష్కర్-ఇ-తోయిబా చీఫ్
హఫీజ్ మహమ్మద్ సయీద్ను పట్టించిన
వారికి $10 మిలియన్ల డాలర్ల బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా
నిర్ణయంపై భారత దేశం హర్షం
ప్రకటించింది. ఈ అంశంపై విదేశాంగ
శాఖ మంత్రి ఎస్.ఎం.కృష్ణ
స్పందించారు. హఫీజ్ పాకిస్తాన్లోనే
ఉన్నారని ఆయన అన్నారు. కుట్రదారులను
పట్టివ్వాలని తాము పాక్ను
ఎన్నిసార్లు కోరినా స్పందించలేదని విమర్శించారు.
0 comments:
Post a Comment