నగర రోడ్లపై చెవులు చిల్లులు పడేలా డుర్.... మంటూ
మ్రోత మోగిస్తూ సాగిపోతున్న ఆటోలకు ఇకపై త్వరలోనే కాలం
చెల్లిపోనుంది. ప్రస్తుతం రోడ్లపై పరుగులు పెడుతున్న సాంప్రదాయ సిటీ ఆటోలకు చెక్
పెడుతూ, సౌకర్యవంతమైన, సురక్షితమైన, స్టయిలిష్ హైబ్రిడ్ త్రిచక్ర వాహనాలు మార్కెట్లోకి రానున్నాయి.
మారుతి
సుజుకి ఇండియా మాజీ చీఫ్ జగదీశ్
ఖత్తర్ ప్రమోట్ చేసిన మారుతి బ్రాండ్
కార్ సర్వీస్ చైన్ 'కార్నేషన్ ఆటో'కు జాక్పాట్
ఆర్డర్ లభించింది. సిటీ ఆటోలను రీప్లేస్
చేస్తూ "ఎలిమెంట్ 6" అనే పేరుతో హైబ్రిడ్
త్రిచక్ర వాహనాలను ప్రవేశపెట్టే ఆర్డర్ కార్నేషన్ ఆటోకు లభించింది. జేఎన్ఎన్యూఆర్ఎమ్ (జవహర్ లాల్ నెహ్రూ
నేషనల్ అర్బన్ రెన్యువల్ స్కీమ్)లో భాగంగా ఈ
ఆర్డర్ లభించినట్లు ఖత్తర్ పేర్కొన్నారు.
తాజా
గణాంకాల ప్రకారం, 2007-08లో దేశవ్యాప్తంగా 5.09 లక్షలుగా ఆటోలు
ప్రస్తుతం 7 లక్షలకు పైగా పెరిగాయి. ఢిల్లీ
వంటి ప్రధాన మెట్రో నగరాల్లో ఎక్కువగా ఆటోల సంచారం ఉంటుంది.
పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టి ఉంచుకొని, పర్యావరణాన్ని, ప్రజలను రక్షించేందుకు కార్నేషన్, జేఎన్ఎన్యూఆర్ఎమ్లు ఈ కొత్త
ప్రణాళికతో ముందుకు వచ్చాయి. పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్లతో పనిచేసే ఈ హైబ్రిడ్ ఆటోలు
సెప్టెంబర్ నెలలో విడుదల కానున్నాయి.
0 comments:
Post a Comment