ప్రస్తుతం రద్దీగా
ఉండే రోడ్లపై అలా బైక్ పార్క్ చేసి కాఫీ తాగొచ్చేలోపే, దుండగులు తమ చేతివాటానికి పనిచెప్పి
చిటికెలో బైక్‌ను మాయం చేసేస్తున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు
తిరిగినా ఫలితం మాత్రం శూన్యం. మరి ఇటువంటి పరిస్థితుల నుండి మన బైక్‌ను రక్షించుకోవడం
ఎలా..? అందుకు ఓ చక్కనైన మార్గాన్ని మేము చూపిస్తాం అంటున్నారు టి-కాప్ కంపెనీ వాళ్లు.
బెంగుళూరుకు
చెందిన ఐట్రాన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 'టి-కాప్' అనే బ్రాండ్ పేరుతో
వాహనాలకు సెక్యూరిటీ సిస్టమ్‌లను అందిస్తోంది. బైక్‌కు టి-కాప్ సెక్యూరిటీ సిస్టమ్‌ను
అమర్చుకోవడం ద్వారా బైక్ యజమాని వాహనం ఎక్కడ ఉందో అతని మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఎవరైనా వాహనాన్ని నకిలీ తాళంతోనో లేదా, బలవంతంగానో ఆన్ చేస్తున్నట్లు అనిపిస్తే, వెంటనే
బైక్‌లో అమర్చిన సైరన్ మ్రోగి అప్రమత్తం చేయడమే కాకుండా, యజమానికి మొబైల్‌కు మెసేజ్
కూడా వస్తుంది.
అంతేకాకుండా..
బైక్ యజమాని ఆన్-డిమాండ్ మేరకు వాహనం ఉన్న ప్రస్తుత లొకేషన్‌ను కూడా తెలుసుకోవచ్చు.
టి-కాప్ అందిస్తున్న బైక్ సెక్యూరిటీ సిస్టమ్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.
సెక్యూరిటీ ఫీచర్స్:
* ఇగ్నిషన్‌ను
బలవంతంగా స్విచ్ ఆన్ చేసినప్పుడు సైరెన్ అలెర్ట్
* ఇగ్నిషన్‌ను
బలవంతంగా స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎస్ఎమ్ఎస్ అలెర్ట్
* రద్దీగా ఉన్న
ప్రదేశాలు/పార్కింగ్ స్థలాల్లో సైరన్ ఆన్/ఆఫ్ ఫీచర్ ద్వారా బైక్‌ను గుర్తించుటం
* సైరన్ ఆన్/ఆఫ్
ఫీచర్ ద్వారా డ్రైవర్‌ను అలెర్ట్ చేయటం
ట్రాకింగ్ ఫీచర్:
* యజమానులు తమ
డిమాండ్ మేరకు 24x7/365 ద్వారా తమ బైక్‌ను ట్రాక్ చేసుకోవచ్చు.
టి-కాప్ సిస్టమ్‌ను
ఉపయోగించండం, అమర్చుకోవడం చాలా సులువు. ఏ మొబైల్ నెట్‌వర్క్‌తో అయినా ఇది పనిచేస్తుంది.
ఇది బేసిక్, సిల్వర్, గోల్డ్ అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. బేసిక్ వేరియంట్ ధర
రూ. 1890, సిల్వర్ వేరియంట్ ధర రూ. 2,890, గోల్డ్ వేరియంట్ ధర రూ. 3,890 లుగా ఉన్నాయి.
టి-కాప్ సెక్యూరిటీ సిస్టమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం టికాప్ అధికారిక వెబ్‌సైట్‌ను
సందర్శించవచ్చు.
0 comments:
Post a Comment