కారులోనే
ఇల్లు ఉంటే ఎంత బావుంటుందో..!
ఏంటి పగటి కలలు కంటున్నారా..
అనకండి. ఒకవేళ ప్రస్తుతానికి ఇది
పగటి కలే అయినా, అతి
త్వరలోనే ఇది నిజం కానుంది.
ఆటోమొబైల్ పరిశ్రమలో ఉపయోగించే టోటల్ ఎన్వీహెచ్
రిడక్షన్ కాంపోనెంట్లను తయారు చేసే
ప్రముఖ కంపెనీ పారాకోట్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (పిసిపి) మోటార్ హోమ్ "పిసిపి టెర్రా" ఇండియాకు తీసుకువచ్చింది. త్వరలోనే ఈ మోటార్ హోమ్
కమ్ ఆఫీస్ కార్లను వాణిజ్య
పరంగా విక్రయించనుంది.
మహీంద్రా
జీనియో లేదా టాటా జెనాన్
వంటి పికప్ ట్రక్కులను ఆధారంగా
చేసుకొని ధృఢమైన ఫైబర్గ్లాస్ (ఎఫ్ఆర్పి) మెటీరియల్తో
తయారు చేయబడిన ఫ్రేమ్ను ఈ పికప్
వాహనాలకు ఫిక్స్ చేయడం జరుగుతుంది. లోపలి
వైపు అత్యంత విలాసవంతమైన, బెస్ట్-ఇన్-క్లాస్ ఇంటీరియర్స్తో ఈ హోమ్
కార్ను పిసిపి డిజైన్
చేసింది. ఒక చిన్న కుటుంబం
లేదా ఏడు మంది ప్రయాణికులు
(డ్రైవర్తో కలిపి) ఈ
పిసిపి టెర్రా హోమ్ కారులో ప్రయాణించవచ్చు.
విలాసవంతమైన
ఇంటీరియర్ డిజైన్, లివింగ్/మీటింగ్ రూమ్ (అవసరం లేదనుకుంటే
బెడ్రూమ్గా మార్చుకుని
ఐదుగురు హాయిగా నిద్రపోవచ్చు. ఎయిర్ కండిషనర్, హీటర్,
రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్, వాష్ రూమ్, షవర్,
షెల్ఫ్స్, కిచెన్ కోసం ఉపయోపడే డ్రాయర్స్,
టివి, రేడియో, డివిడి, ఎమ్పి3తో
కూడిన స్టీరియో మల్టీ మీడియా సిస్టమ్,
మంచి నీటిని, చెడు నీటిని సూచించే
ఇండికేటర్ వంటి ఫీచర్లు ఈ
పిసిపి హోమ్ కమ్ ఆఫీ
కార్లో ఉండే ప్రత్యేకమైన,
విశిష్టమైన ఫీచర్లు.
అంతేకాకుండా
ఈ కారుకు వెనుకవైపు ఓ కెమెరా ఉంటుంది.
ఈ కెమరాను డ్రైవర్ క్యాబిన్లోని సెంటర్ కన్సోల్పై ఉండే మోనిటర్కు కనెక్ట్ చేయబడి
ఉంటుంది. రక్షణదళంలోని వ్యక్తులు, మౌళిక రంగ కంపెనీలు,
కార్పోరేట్లు, ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీలు,
రాజకీయ నాయకులు మొదలైన వారిని దృష్టిలో ఉంచుకొని పిసిపి ఈ హోమ్ కారును
డిజైన్ చేసింది. భారత్లో పిసిపి
టెర్రా ధర రూ.31 లక్షల
నుండి రూ.37 లక్షల రేంజ్లో ఉండే అవకాశం
ఉంది.
0 comments:
Post a Comment