కొత్త పల్సర్‌ను
సరికొత్త డిజైన్‌తో విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్న బజాజ్ ఆటో ఈసారి డిస్కవర్‌లో మరో
సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇప్పటికే 2012 వెర్షన్
బజాజ్ డిస్కవర్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. ఇది ఈ ఫోటోను చూడండి.
మహారాష్ట్రలో కొత్త బజాజ్ డిస్కవర్ బైక్‌ను టెస్ట్ రన్ చేస్తుండగా తీసినది.
ప్రస్తుతం మార్కెట్లో
లభిస్తున్న డిస్కవర్ డిజైన్‌ను దాదాపుగా అలాగే ఉంచుతో గ్యాస్ ఫిల్డ్ మోనషాక్ అబ్జార్వర్
(కొత్త పల్సర్, హోండా యునికార్న్ మోడళ్లలో ఉపయోగించినట్లుగా సింగిల్ సెంటర్ సస్పెన్షన్)ను
ఇందులో కొత్తగా జోడించినట్లు ఈ చిత్రం ద్వారా తెలుస్తోంది. కొత్త డిస్కవర్ ఫ్యూయెల్
ట్యాంక్ ప్రస్తుత వెర్షన్ కన్నా పెద్దదిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఫ్రంట్ సస్పెన్షన్,
ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్‌లు యధావిధిగా ఉన్నాయి. రీడిజైన్ చేయబడిన
సైలెన్సర, సరికొత్త ఇండికేటర్స్, హెక్సాగనల్ షేప్‌లో ఉండే సరికొత్త రియర్ వ్యూ మిర్రర్స్
(సైడ్ మిర్రర్స్), రీడిజైన్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ (స్పీడోమీటర్ కన్సోల్)
వంటి అనేక మార్పులు సరికొత్త డిస్కవర్‌లో ఉండనున్నాయి.
కొత్తగా మార్కెట్లోకి
రానున్న ఈ సరికొత్త 2012 బజాజ్ డిస్కవర్ ఖచ్చితంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిస్కవర్
ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండనుంది. కాగా.. బజాజ్ తాజాగా ప్రవేశపెట్టిన పల్సర్ 200ఎన్
మోడల్ అమ్మకాలు వచ్చే నెల నుండి ప్రారంభం కానున్నాయి. బజాజ్ నుండి డిస్కవర్, పల్సర్
బ్రాంజ్‌లు అత్యధికంగా అమ్ముడవుతున్న సంగతి తెలిసిందే. కొత్త మోడళ్ల రాకతో వీటి జోరు
మరింత పెరగనుంది.
0 comments:
Post a Comment