బోయపాటి
శ్రీను, మహేష్ బాబు కాంబినేషన్
లో త్వరలో ఓ చిత్రం రూపొందనుందంటూ
వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ
నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ....నేను మహేష్ బాబుని
కలవటం వరకూ నిజం...అయితే
స్టోరీ లైన్ ఏదీ డిస్కస్
చేయలేదు. అయితే మేము త్వరలో
కలిసి పనిచేస్తాం అన్నది మాత్రం నిజం...అలాగే నేను ఎక్సపెరిమెంట్స్
చేయదలచుకోలేదు...నేను మరో రెండు
కమర్షియల్ హిట్ సినిమాలు చేసేదాకా
నా పంధా వదలను అన్నారు.
ఇక మహేష్,బోయపాటి శ్రీను
మీటింగ్ ఇండస్ట్రీలో చర్చనీయాంసమైంది. బోయపాటి ఓ లైన్ చెప్పాడని,అయితే అది విన్న
మహేష్ బాబు...తనకు తయారు చేసే
లైన్ ఎలా ఉండాలో ఖచ్చితంగా
చెప్పినట్లు చెప్పుకుంటున్నారు.
అలాగే
తన వర్కింగ్ స్టైల్ ని గురించి బోయపాటి
శ్రీను చెపుతూ...అది రవితేజ కావచ్చు..వెంకటేష్ కావచ్చు...బాలకృష్ణ కావచ్చు...ఎన్టీఆర్ కావచ్చు...ఎవరైనా సరే...వారి సొంత
స్టైల్స్ ని నేను నా
సినిమాలో పెట్టడానికి ట్రై చేస్తాను..అందుకే
వారి అభిమానులకు నేను చేసిన సినిమాలు
బాగా నచ్చుతాయి. హీరోతో నేను సినిమా కమిటయ్యే
ముందు...వారు గతంలో చేసిన
సినిమాలు పరిశీలించి స్క్రిప్టు రెడీ చేసుకుంటాను...వారి
బాడీలాంగ్వేజ్ కి తగ్గట్లుగా నేను
సీన్స్,కథనంలో మార్పులు చేసుకుంటాను..దాంతో అవి ఫెరఫెక్ట్
గా వారే ఆ పాత్ర
కోసం పుట్టినట్లుగా తయరయ్యి ప్రేక్షకుల్లోకి బాగా వెళతాయి అన్నారు.
అంతేగాక నేను చేసిన హీరోలంతా
పెద్ద స్టార్స్ ..వారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అది కూడా
దృష్టిలో పెట్టుకుని సినిమాను తీర్చిదిద్దుతాను అన్నారు.
అలాగే
ఫ్యాన్స్ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయని నేను ఎప్పుడూ ఒత్తిడి
ఫీల్ కాను...నేను నిజాయితీగా స్క్రిప్టు
దశనుంచి పనిచేస్తాను...బౌండెడ్ స్క్రిప్టు లేనిదే సినిమా చెయ్యను...మొదటి నుంచి అదే
అలవాటు అన్నారు బోయపాటి శ్రీను. ఇక ఎన్టీఆర్ తో
చేసిన దమ్ము చిత్రం గురించి
చెపుతూ...నేను చాలా స్క్రిప్టులు
ఎన్టీఆర్ కి వినిపించాను. అయితే
అవేమీ ఆయన ఓకే చేయలేదు.
ఫైనల్ గా దమ్ము స్క్రిప్టు
నచ్చింది. వెంటేనే ఆయన సినమా చేయటానికి
డేట్స్ కేటాయించి సహకరించారు. ఎన్టీఆర్ అధ్బుతమైన సహకారం వల్లనే సినిమా అంత బాగా వచ్చింది
అన్నారు.
అలాగే
డైలాగులు విషయానికి వస్తే తాను చాలా
శ్రద్ద తీసుకుంటానని..హీరో నోటి వెంట
ఎలాంటి డైలాగులు చెపితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారో అలాంటి
డైలాగులుకు ప్రయారిటీ ఇస్తానని అన్నారు. సింహా లో డైలాగులు
రాసిన తాను ఈ సారి
ఆ బర్డెన్ పెట్టుకోదలుచుకోలకే వేరే రైటర్ చేత
రాయించానని అన్నారు. దమ్ములో డైలాగులుకు మంచి స్పందన వస్తుందనే
నమ్మకం వ్యక్తం చేసారు. ఇప్పటికే తమ చిత్రం ట్రైలర్స్
చూసిన వాళ్లు తనకు పోన్స్ చేసి
కంగ్రాట్స్ చెపుతున్నారని,సినిమా విడుదల అయ్యాక వారి అంచనాలను క్రాస్
చేస్తాననే నమ్మకం ఉందని అన్నారు. ఇక
బోయపాటి శ్రీను డైరక్ట్ చేసిన దమ్ము చిత్రం
త్వరలో విడుదల కానుంది.
0 comments:
Post a Comment