హైదరాబాద్:
ప్రముఖ దర్శక నిర్మాత దాసరి
నారాయణ రావు మరోసారి సంచలన
వ్యాఖ్యలు చేశారు. స్టార్ల కోసమే అవార్డు ఫంక్షన్లు
నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. స్టార్లు
రావాలని వారికే అవార్డులు ఇస్తున్నారని ఆయన సోమవారం అన్నారు.
ప్రతిభ గలవారికి, నిజాయితీగా అవార్డులు ఇవ్వాలని ఆయన సూచించారు.
చిన్న
చిన్న అవార్డుల నుంచి పద్మా అవార్డుల
వరకు పైరవీలతోనే వస్తున్నాయని ఆయన విమర్సించారు. అవార్డుల
ప్రదానోత్సవ కార్యక్రమాలకు స్టార్లు రావడం కోసం వారికి
అవార్డులు ఇస్తున్నారని ఆయన అన్నారు. స్టార్లకే
అవార్డులు ఇవ్వడం సరి కాదని ఆయన
అన్నారు. అవార్డులకు గౌరవం తగ్గిందని ఆయన
అన్నారు.
పద్మశ్రీ,
పద్మభూషణ్ నుంచి దాదా సాహెబ్
ఫాల్కే అవార్డు వరకు పైరవీలతోనే వస్తున్నాయని
ఆయన విమర్శించారు. మొదట ప్రైవేట్ అవార్డులు
ఆ విధంగా వచ్చేవని, ఇప్పుడు రాష్ట్ర స్థాయి అవార్డులతో పాటు కేంద్ర స్థాయి
అవార్డులు కూడా అదే విధంగా
వస్తున్నాయని ఆయన అన్నారు. వ్యక్తులు
పైరవీలు చేసి అవార్డులు తెచ్చుకునే
దుస్థితి చోటు చేసుకుందని ఆయన
అన్నారు.
కొన్ని
విషయాల్లో దాసరి నారాయణ రావు
ప్రస్తుత పరిణామాలను వ్యతిరేకిస్తున్నారు. సినీ రంగంలోని వ్యతిరేక
లక్షణాలతో ఆయన విభేదిస్తూ వస్తున్నారు.
తాజాగా, దాసరి నారాయణ రావు
చేసిన ప్రకటన టాలీవుడ్లో తీవ్ర సంచలనం
సృష్టించే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment