జాతీయ
స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి
ప్రాభవం తగ్గినట్లే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి
తర్వాత కూడా జాతీయ స్థాయిలో
తృతీయ కూటమి ఏర్పాటుకు చంద్రబాబు
తీవ్రంగా ప్రయత్నించారు. కాంగ్రెసు, బిజెపి యేతర పక్షాలను కూడగట్టడానికి
ఆయన ప్రయత్నించారు. ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడే అయినా ఆయనకు జాతీయ
రాజకీయాల్లో ఎక్కడ లేని ప్రాధాన్యం
దక్కుతూ వచ్చింది. కానీ పరిస్థితి మారినట్లు
కనిపిస్తోంది.
రాష్ట్రపతి
ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహం గురించి ఎస్పీ నేత ములాయం
సింగ్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు
ముఖ్యమంత్రి జయలలిత చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో చంద్రబాబుకు
వారు భాగస్వామ్యం కల్పిండం లేదు. ఆదివారం చంద్రబాబు
నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్టప్రతి
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్
కలాం ఆజాద్ను మరో
విడత రాష్ట్రపతి పదవికి ములాయం ప్రతిపాదించారు. కానీ చంద్రబాబును సంప్రదించలేదు.
తెలుగుదేశం
పార్టీ 2004లో ఓడిపోయినప్పుడు ములాయం
సింగ్ తదితరులతో కలిపి జాతీయ స్థాయిలో
మూడో కూటమిని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు. చంద్రబాబు నివాసంలో వివిధ పార్టీలకు చెందిన
నాయకులు అప్పట్లో సమావేశమయ్యారు. అయితే, అది అంతగా ఫలితం
ఇవ్వలేదు. వివిధ సందర్భాల్లో కాంగ్రెసేతర
ముఖ్యమంత్రులు యుపిఎకు వ్యతిరేకంగా కార్యాచరణను రూపొందించే కార్యక్రమాలు చేపట్టారు. దానికి కూడా చంద్రబాబును దూరంగా
ఉంచారు.
ఉత్తరప్రదేశ్
శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ
విజయం సాధించడంతో జాతీయ స్థాయిలో రాజకీయాలు
మలుపు తిరిగాయి. కాంగ్రెసు, బిజెపియేతర పక్షాలకు సమాజ్వాదీ పార్టీ
నేత ములాయం సింగ్ నాయకత్వం వహించే
స్థాయి వచ్చింది. దీంతో మూడు కూటమికి
చెందిన రాజకీయాలు ఇప్పుడు ములాయం సింగ్ చుట్టూ తిరుగుతున్నాయి.
గతంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించిన
చంద్రబాబు ప్రస్తుతం వెనకబడిపోయారు.
0 comments:
Post a Comment