రవితేజ,తాప్సీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం
'దరువు'. శౌర్యం శివ దర్సకత్వం వహిస్తున్న
ఈ చిత్రాన్ని మే 4న సినిమాని
విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి
తెలిసిందే. అయితే తాజాగా అందిన
సమాచారం ప్రకారం ఆ రిలీజ్ ని
వాయిదా వేసారు. మే 18న చిత్రం
విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ దమ్ము చిత్రం బాగా
వచ్చిందని టాక్ రావటంతో...ఆ
కలెక్షన్ ఎఫెక్టు తగ్గేవరకూ వేచి ఉండటం బెస్ట్
అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు
వినికిడి. ఇక ఈ చిత్రాన్ని
బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు.
ఇక ఈ చిత్రం కథ
గురించి మీడియాతో నిర్మాత మాట్లాడుతూ .ఎవరితోనైనా గొడవకు దిగండి. కానీ మాస్తో
పెట్టుకోకండి. వాళ్ల దగ్గర కాస్త
పొగరు ఎక్కువ. ఆనందం వచ్చినా, ఆవేశం
వచ్చినా తీన్మార్ ఆడేస్తారు.
ఆ కుర్రాడూ అంతే. నోటితో పోయేదాన్ని,
చేతి దాకా తెచ్చుకొంటాడు. గొడవకు
దిగడం అంటే మహా సరదా.
ఇంతకీ అతగాడి కథేమిటో తెలియాలంటే 'దరువు' సినిమా చూడాల్సిందే అన్నారు. రవితేజ హావభావాలకు సరిపడే కథ ఇది. మాస్ని ఆకట్టుకొనే అంశాలున్నాయి
అని చెప్పారు. ఇక 'దరువు'చిత్రానికి
'సౌండ్ ఆఫ్ మాస్' అనేది
ట్యాగ్ లైన్. సంగీతం: విజయ్
ఆంథోని, సమర్పణ: నాగమునీశ్వరి.
రవితేజ
మాట్లాడుతూ..''నా సినిమాలో మాస్
అంశాలు పుష్కలంగా ఉంటాయి. యాక్షన్, వినోదం, గెటప్పులు... ఇలా అన్ని విషయాల్లోనూ
దరువు వినిపించేలా ఉంటుంది ఈ చిత్రం . శివతో
నాకిది మొదటి సినిమా. ఫెంటాస్టిక్
డెరైక్టర్. సినిమా బాగా వచ్చింది. శివరామకృష్ణగారు
రాజీపడని నిర్మాత. మాటలు, ఫైట్లు, డాన్సులు.. ఇలా అన్ని రకాలుగా
ప్రేక్షకులతో ఈ చిత్రం దరువేయిస్తుంది.
ఇది మంచి చిత్రం అవుతుందని
100 శాతం నమ్ముతున్నాను. ఈ సినిమాకి సంబంధించిన
సన్నివేశాలను శివ చెబుతున్నప్పుడు నాకు
నేనే చాలాసార్లు దరువేసుకున్నాను అన్నారు.
పూరీ
జగన్నాధ్ మాట్లాడుతూ....ఈ టైటిల్ నాకు
బాగా నచ్చింది. పాటలు కూడా చాలా
బాగున్నాయి అని రవితేజ చెప్పాడు.
ఈ టీమ్కి ఆల్
ది బెస్ట్ చెబుతున్నా. ఇకనుంచి శివరామకృష్ణగారు వరుసగా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు శివ మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు
రవితేజ చేసిన అన్ని చిత్రాలకన్నా
‘ దరువు’ వ్యత్యాసంగా
ఉంటుంది. ఇందులో రవితేజ పలు రకాల గెటప్స్లో కనిపిస్తారు’’ అని చెప్పారు.
0 comments:
Post a Comment