నిన్నటి
నుంచి ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్
గా మారిన ఏకైన అంశం...
భాను కిరణ్ ఎవరేసిన ఆ
ఇద్దరు హీరోయిన్స్ ఎవరు అనేదే. ఎవరికి
తోచిన విధంగా వారు రకరకాల అంచనాలు
వేసుకుంటున్నారు. వారు లెక్కల్లో ఒకరు
పొడుగ్గా ఉన్న హీరోయిన్ అయితే,
మరొకరు రీసెంట్ గా తెలుగులో వేషాలు
లేక ఫేడవుట్ అయిన ఓ హీరోయిన్
అని అంటున్నారు. అయితే వారిద్దరు అని
ఆధారాలు లేకపోయినా... వారు టాపిక్ లో
వారిద్దరూ చోటు చేసుకోవటం విశేషం.
మద్దెలచెర్వు
సూరి హత్య కేసులో కీలక
నిందితుడు మల్లిశెట్టి భాను కిరణ్ అలియాస్
భాను భూ దందాల్లో తన
అక్రమ కార్యకలాపాల కోసం భారీ నగదు,
ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లను పంపించటం ద్వారా ఇద్దరు రెవిన్యూ డివిజన్ అధికారులు(ఆర్టీవో), ఒక సబ్ కలెక్టర్‌ను లోబరచుకున్నానని వాగ్మూలం
ఇచ్చారు. అది నిన్నంతా ప్రతీ
టీవీ ఛానెల్ లోనూ మారు మ్రోగిపోయింది.
సాధారణంగా వివాదాస్పద భూముల సమాచారాన్ని ఈ
అధికారుల నుంచి రాబట్టే భాను
సంబంధిత భూముల యజమానులను సంప్రదించేవాడు.
మద్దెలచెర్వు సూరి పేరు చెప్పుకొని
భాను భూదందాలు చేపట్టేవాడు.
''విలువైన
సమాచారం పొందటానికి, భూ దందాల్లో అధికారుల
సాయం కోసం రంగారెడ్డి జిల్లాలో
ఇద్దరు ఆర్టీవోలు, ఒక సబ్ కలెక్టర్‌కు భారీ నగదు
ఇచ్చాను. వారి వద్దకు ఇద్దరు
టాలీవుడ్ హీరోయిన్లను పంపించాను. కూకట్పల్లి, మియాపూర్,
రాయదుర్గం, ఇతర పోలీస్ స్టేషన్ల
పరిధుల్లో పలు పోలీసు అధికారులను
కూడా లోబరుచుకున్నాను'' అని సిఐడి అధికారుల
విచారణలో భాను చెప్పాడు.
ఈ నేఫధ్యంలో ఆ ఇద్దరు హీరోయిన్స్
పేర్లను సిఐడీ అధికారులు బయిటపెడతారా
లేదా అన్నది ఆసక్తిగా మారింది. అలాగే...ఆ ఇద్దరు హీరోయిన్స్
కి అండగా నిలబడే టాలీవుడ్
హీరో ఒకరు వారి పేర్లు
బయిటకు రాకుండా చూసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఏది ఎంతవరకూ నిజమే
కానీ...ఇదిగో తోక...అంటే
అదిగో పులి అనే టాలీవుడ్
పరిశ్రమలో ఇదే మ్యాటర్ ఇప్పుడు
ఎవరి నోట విన్నా వినపడుతోంది.
తెలుగు
సినీ నిర్మాత సి.కళ్యాణ్ కూడా
భాను సహాయం తీసుకున్నాడని వార్తలు
వచ్చాయి. భాను చొరవతో వాటిని
పరిష్కరించుకున్నాడని అంటున్నారు. మరో సినీ నిర్మాత
సింగనమల రమేష్ కూడా భానుతో కలిసి
భూదందాలు చేశాడని, భూ దందాలు పరిష్కరించటం
ద్వారా రూ.800 కోట్ల విలువైన ఆస్తులను
భాను కూడగట్టాడని, వాటిని బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించాడని సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు.
మెదక్ జిల్లాలో, జహీరాబాద్ సమీపంలో ఉన్న ఒక దాభా
వద్ద కొద్ది రోజుల క్రితం సిఐడి
అధికారులు భానును అరెస్ట్ చేశారు. భాను ప్రస్తుతం చర్లపల్లి
కేంద్ర కారాగారంలో ఉన్నాడు.
0 comments:
Post a Comment