హైదరాబాద్:
మాజీ మంత్రి శంకర రావు ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మీడియాతో
మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి ఏమీ బాగా లేదని
ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందన్నారు.
అసలు ఏమవుతుందో అర్థం కావడం లేదన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
అలాగే కొనసాగితే పార్టీకి చాలా కష్టమన్నారు.
ఉప ఎన్నికలలోపే ముఖ్యమంత్రిని మార్చాలని ఆయన సూచించారు. లేదంటే
రానున్న ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఒక్క సీటు గెలవటం
కూడా కష్టమని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి
పాలనలో అన్నీ వైఫల్యాలనే అని
విమర్శించారు. సిఎం వద్దకు వెళ్లిన
ఫైళ్లు అన్నీ వెనక్కి వస్తున్నాయని
మండిపడ్డారు. కిరణ్ అగ్రకుల దురహంకారి
అని మండిపడ్డారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రులను వెంటనే తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
అక్రమార్కులపై చర్యలు తీసుకుంటేనే కాంగ్రెసు రాష్ట్రంలో బతికి బట్ట కడుతుందన్నారు.
ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడుగా, ముఖ్యమంత్రిగా,
స్పీకర్గా సీమాంధ్ర ప్రాంతానికి
చెందిన నేతలే ఉన్నారన్నారు.
అందుకే
తెలంగాణ సెంటిమెంట్ మరింత బలపడుతోందని ఆయన
అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని
దళిత వ్యతిరేకిగా చిత్రీకరించడం బాధాకరమని, అది సరికాదని ఆయన
అన్నారు. వైయస్ పైన విమర్శలు
చేస్తున్న వారిని పార్టీ పెద్దలు మందలించాలని సూచించారు. తాను వాయలార్ రవి
అపాయింటుమెంటు కోరానని, అనుమతి వస్తే వెళ్లి కలుస్తానని
చెప్పారు.
0 comments:
Post a Comment