ఏలూరు:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసమే
తాజా మాజీలు తమ ఎమ్మెల్యే పదవులకు
రాజీనామా చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
బుధవారం ఆరోపించారు. ఆయన పశ్చిమ గోదావరి
జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా
బియ్యం ఇస్తుందని ప్రకటించారు.
ప్రస్తుతం
కాంగ్రెసు పార్టీ రూ.200 రూపాయలు పింఛన్ ఇస్తుందని తాము రూ.500కు
దానిని పెంచుతామని చెప్పారు. నిరుద్యోగ యువతకు రూ.1000 నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ సక్రమంగా
చెల్లించి వారికి ఉచిత విద్యను అందిస్తామని
చెప్పారు. ఆయన ఇక్కడ బుధ,
గురువారం రెండు రోజులు పర్యటిస్తారు.
ఉదయం కొయ్యలగూడెం చేరుకున్న ఆయనకు దారిపొడువునా కార్యకర్తలు
ఘన స్వాగతం పలికారు. అక్కడ స్థానిక పొగాకు
రైతులతు బాబు ముచ్చటించారు. వారి
సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
పొగాకు
బోర్డు చైర్మన్తో మాట్లాడి గిట్టుబాటు
ధర ఇప్పించేందుకు కృషి చేస్తానని వారికి
హామీ ఇచ్చారు. అక్కడి నుండి బయ్యన్నగూడెం వెళ్లి
అక్కడి నుండి రోడ్ షో
నిర్వహించారు. నాగులపల్లి వద్ద రోడ్డు పక్కన
ఆగి చిన్న హోటల్లో
టీ తాగారు. కాగా అంతకుముందు హైదరాబాద్
నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బాబుకు టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
ఆయనకు స్థానిక నేతలు దాసరి బాలవర్ధన
రావు, దేవినేని ఉమా మహేశ్వర రావు,
తంగిరాల ప్రభాకర్, మాగంటి బాబు, అంబికా కృష్ణ
తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం
రోడ్డు మార్గాన పోలవరం బయలుదేరారు. మార్గమధ్యంలో హనుమాన్ జంక్షన్ వద్ద అభయాంజనేయ స్వామి
వారిని దర్శించుకున్నారు. చంద్రబాబు వెంట మాగంటి బాబు,
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. ప.గో జిల్లాలో
పోలవరం, నర్సాపురం నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు ఉన్న
విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment