హైదరాబాద్:
రాష్ట్రంలో అధికార కాంగ్రెసు పార్టీ నేతలకు రాజకీయ మోజు తీరిపోతున్నట్టుగా కనిపిస్తోంది.
అధికార పార్టీ నేతలే ఇటీవల రాజకీయాల
పట్ల వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. మరికొందరు ప్రస్తుత రాజకీయాల పట్ల విసుగు కలుగుతోందని
తప్పుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు
ఎంపీల వరకు రాజకీయ వైరాగ్యం
ప్రదర్శిస్తున్నారు. మూడు రోజుల క్రితం
ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్
రవీంద్రా రెడ్డి ప్రస్తుత రాజకీయాల పట్ల తాను విసుగు
చెందానని, తన నియోజకవర్గం ప్రజలు,
పార్టీ కార్యకర్తలతో చర్చించి తాను రాజకీయాల నుండి
శాశ్వతంగా వైదొలగేందుకు నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.
అంతేకాదు
తాను రాజకీయాలలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు
పార్టీలో ముఖ్యమంత్రులుగా ఎదిగిన వారు వారు ఎలా
ఎదిగారో ఓ పుస్తకాన్ని రాస్తానని
చెప్పుకొచ్చారు. దానికి మేకింగ్ ఆఫ్ సిఎం అని
పేరు పెట్టారు. అందులో ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై
తీవ్ర విమర్శలు డిఎల్ చేసే అవకాశముందని
అంటున్నారు.
ఒక్క
రూపాయి బియ్యం పథకాన్ని వ్యతిరేకించినప్పటి నుండి ఇటీవల శాఖల
కోత కేటాయింపు వరకు డిఎల్, కిరణ్
మధ్య వైరం అంతకంతకు పెరుగుతూ
వచ్చింది. కిరణ్ పట్ల అధిష్టానం
ఎలాంటి చర్యలు తీసుకునేందుకు సుముఖత చూపకపోవడంతో డిఎల్ ఇక రాజకీయ
సన్యాసం ప్రకటన చేస్తానని చెప్పారు. ఇక అనంతపురం జిల్లా
మాజీ మంత్రి, సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి
ఇంచుమించు అలాంటి ప్రకటనే చేశారు.
రాష్ట్ర
రాజకీయాలపై విరక్తి చెందిన ఆయన కేంద్రానికి వెళ్లడం
ఉత్తమమని గతంలో ప్రకటించారు. ఆయనకు
రాష్ట్ర రాజకీయాలు విసుగు పుట్టిస్తున్నాయని చెప్పారు. గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు రాజకీయాలపై రెండుమూడుసార్లు
నిరాసక్తత వ్యక్తం చేశారు. ఓ సమయంలో ఆయన
జగన్ పార్టీలోకి వెళతారనే ప్రచారం జరిగినప్పటికీ ఆయన మాత్రం దానిని
ఖండించారు. వెళితే పూర్తిగా రాజకీయాల నుండే వెళ్లిపోతానని చెప్పారు.
రాజమండ్రి
పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చే
ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకునే
అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి కూడా వైరాగ్యం ప్రదర్శించారు.
ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఎన్నికల ప్రచారం పర్వంలో ఆయన మాట్లాడుతూ.. తాను
సిఎం అయినప్పటి నుండి మూడు నెలలకోసారి
ఉప ఎన్నికలు వస్తున్నాయని, తాను బాధ్యతలు చేపట్టిన
ముహూర్తం బాగా లేదేమో అని
అన్నారు.
0 comments:
Post a Comment