ఒంగోలు/శ్రీకాకుళం: రాజ్యసభ సభ్యుడు చిరంజీవి త్వరలో ఒంగోలు నుండి ప్రచారం ప్రారంభిస్తారని
మంత్రి మాణిక్య వర ప్రసాద్ బుధవారం
ప్రకాశం జిల్లాలో అన్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని వర్గాలకు
కాంగ్రెసులోనే న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
రాష్ట్రానికి పని చేసిన ముఖ్యమంత్రులలోకెల్లా
బెస్ట్ సిఎం అని కితాబు
ఇచ్చారు.
త్వరలోనే
పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి
అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు
కాంగ్రెసు వైపే ఉన్నారని చెప్పారు.
వారి ఆదరణతోనే కాంగ్రెసు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికలు ముగిసేంత వరకు ఒంగోలులోనే ఉండి
కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని
చెప్పారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పేరును
జగన్ పార్టీగా మార్చుకోవాలని శ్రీకాకుళంలో సూచించారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో జగన్
పార్టీ అభ్యర్థులు గెలిస్తే అది ఓటర్ల తప్పే
అవుతుందని ఆయన చెప్పారు. అన్ని
నియోజకవర్గాలలోనూ కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని చెప్పారు.
మాచర్ల,
ప్రత్తిపాడు నియోజకవర్గాలలో కాంగ్రెసు గట్టి పోటీ ఇస్తోందని
మరో మంత్రి కాసు వెంకట కృష్ణా
రెడ్డి అన్నారు. సహకార ఎన్నికలు నిర్వహించాలన్న
కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందని చెప్పారు. సహకార
ఎన్నికల నిర్వహణపై మంత్రివర్గ ఉపసంఘం త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని చెప్పారు. ప్రస్తుత పాలక మండళ్లను కొనసాగించడం
వల్ల ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేవని ఆయన అన్నారు.
ఎండా
కాలం అయినందున తాగునీటి సరఫరాకు ఎలాంటి ఎన్నికల కోడ్ అడ్డు రాకుండా
ఎన్నికల సంఘాన్ని అధికారులు సంప్రదిస్తున్నారని మరో మంత్రి కన్నా
లక్ష్మీ నారాయణ చెప్పారు. పద్దెనిమిది నియోజకవర్గాలలోనూ కాంగ్రెసు పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.
ఉప ఎన్నికలు జరగనున్న పన్నెండు నియోజకవర్గాలలో నీటి సరఫరా కోసం
నిధుల విడుదల విషయమై ప్రభుత్వం ఈసిని సంప్రదిస్తోందని మరో
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
చెప్పారు. ఈసి తీసుకునే తుది
నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు.
0 comments:
Post a Comment