ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డికి కుర్చీ భయం పట్టుకున్నట్లుంది. దాంతో ఆయన
తన కుర్చీ దిశ మార్చి కూర్చున్నారు.
తాను ఢిల్లీలో ఉండగా, వాయలార్ రవి హైదరాబాద్ వచ్చి
నాయకులతో సంప్రదింపులు జరిపారు. దీంతో ఆయన తన
సీటు కిందికి నీళ్లు వస్తున్నాయని అనుమానించినట్లున్నారు. చాలా మంది నాయకులు
కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదులు చేశారు. దీంతో తన పనితీరు
పట్ల వాయలార్ రవి వ్యతిరేకత ప్రదర్శిస్తారని
ఆయన భయపడినట్లు చెబుతున్నారు.
గతంలో
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
కూర్చున్న చోట కూర్చోవాలని ఆయన
నిర్ణయించుకున్నారు. దీంతో బుధవారం తన
కుర్చీని ఆయన అక్కడ వేయించుకున్నారు.
వాస్తుగండంపై, ముహూర్తాలపై కిరణ్ కుమార్ రెడ్డికి
ఇటీవలి కాలంలో తీవ్రమైన ఆందోళనే చోటు చేసుకున్నట్లు ఆయన
మాటలే కాదు, చర్యలు కూడా
నిరూపిస్తున్నాయని అంటున్నారు. ఢిల్లీలోని ఎపి భవన్లో
గల గురజాడ ఆడిటోరియంలో కూడా ఆయన తాను
కూర్చునే సీటు దిశను మార్చుకున్నారు.
"నేను
వాస్తు ప్రకారం కూర్చుంటున్నాను'' అని ముఖ్యమంత్రి బుధవారం
ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నవ్వుతూ అన్నారు. టీవీ కెమెరాలకు ఇబ్బంది
అవుతుందని చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోవలేదు. తన
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ముహూర్తం
బాగా లేనట్లుందని, పంతులు సరైన ముహూర్తం చూసినట్లు
లేదని ఆయన ఇటీవల ఉత్తరాంధ్ర
పర్యటనలో అన్న విషయం తెలిసిందే.
తాను
ఢిల్లీలో ఉండగా పార్టీ వ్యవహారాలపై
పరిశీలన జరిపేందుకు కేంద్ర మంత్రి వాయలార్ రవి హైదరాబాదు వెళ్లడంలో
తప్పేమి లేదని ఆయన అన్నారు.
గులాం నబీ ఆజాద్ కేంద్ర
మంత్రి కావడం వల్ల తీరిక
లేకపోవడంతో వాయలార్ రవి హైదరాబాదు వెళ్లారని
ఆయన సమర్థించే ప్రయత్నం చేశారు. వాయలార్ రవి హైదరాబాదు వెళ్తున్నట్లు
తనకు తెసుసునని ఆయన చెప్పారు. మొత్తం
మీద, కిరణ్ కుమార్ రెడ్డి
తనకు వ్యతిరేకంగా గ్రహాలు తిరుగుతున్నాయని భావిస్తున్నట్లే ఉన్నారు.
0 comments:
Post a Comment