హైదరాబాద్:
రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవితో
వాయలార్ రవి బుధవారం పావుగంట
పాటు ఆయన ఇంట్లో ఏకాంతంగా
మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెసు పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన వాయలార్ రవికి చిరంజీవి బుధవారం
ఉదయం అల్పాహార విందు ఇచ్చిన విషయం
తెలిసిందే. విందు అనంతరం చిరంజీవితో
రవి కాసేకు వ్యక్తిగతంగా మాట్లాడారు. పావుగంట పాటు మాట్లాడినా చిరుతో
చాలా విషయాలే రవి మాట్లాడారని అంటున్నారు.
భవిష్యత్తులో
పెద్ద బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుందని చిరంజీవికి రవి సూచించారట. తాను
జిల్లాల పర్యటనలకు వెళ్లాలనుకుంటున్నానని, అయితే ఏ హోదాలో
వెళ్లాలి అన్న మీమాంస ఎదురవుతోందని
చిరు ఆయనతో చెప్పినట్లుగా సమాచారం.
దానికి రవి స్పందిస్తూ.. రాబోయే
రోజుల్లో పెద్ద బాధ్యతలు స్వీకరించాల్సి
ఉంటుందని సూచనప్రాయంగా చెప్పారట.
కష్టకాలంలో
ఆదుకున్న చిరంజీవిని దీర్ఘకాలంలో బాగా ఉపయోగించుకోవాలనే భావతో
పార్టీ ఉందని చెప్పినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ అంశంపై కూడా వీరి మధ్య
చర్చకు వచ్చిందని తెలుస్తోంది. తెలంగాణపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా
తాను సమర్థిస్తానని, తెలంగాణలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో
త్వరగా నిర్ణయం తీసుకోవాలని రవికి చిరంజీవి సూచించారట.
పోలవరం,
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడంతో
పాటు పెండింగులో ఉన్న రైల్వే ప్రాజెక్టులు
కొన్నింటిని మంజూరు చేస్తే రాష్ట్రంలో మంచి వాతావరణం ఏర్పడుతుందని
చెప్పినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికలకు తక్షణం
అభ్యర్థులను ఎంపిక చేయాలని కూడా
ఆయనకు చెప్పారట. సినిమాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సందేశాత్మక చిత్రాలను చేయాలని చిరుకు రవి సూచించారని తెలుస్తోంది.
అలాగే
త్వరలో జరగనున్న పద్దెనిమిది నియోజకవర్గాల ఉప ఎన్నికలలో 17 స్థానాలోని
అభ్యర్థులు కాంగ్రెసు వారిగానే రాజీనామా చేసినప్పటికీ వారు ఇప్పుడు జగన్
వైపు వెళ్లారు. చిరు రాజీనామాతో ఖాళీ
అయిన తిరుపతి స్థానం మాత్రం అందుకు మినహాయింపు. దీంతో ఆ స్థానం
మిగిలిన వాటికంటే ఎంతో ప్రతిష్టాత్మకం. అంతేకాకుండా
అది చిరంజీవి స్థానం. దీంతో తిరుపతి అభ్యర్థి
పైనా వారి మధ్య చర్చకు
వచ్చినట్లుగా తెలుస్తోంది.
0 comments:
Post a Comment