నెల్లూరు/హైదరాబాద్: ఉప ఎన్నికలలో సిపిఎం
పార్టీ గెలిచే అవకాశాలు లేవని, అందుకే ఆ పార్టీకి మద్దతు
ఇవ్వలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
నారాయణ గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు
నెల్లూరు జిల్లాలో అన్నారు. సిపిఎం, సిపిఐల మధ్య విభేదాలు తాత్కాలికమేనని
ఆయన చెప్పారు. వచ్చే ఉప ఎన్నికలలో
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఉప ఎన్నికలలో సిపిఎం గెలిచే అవకాశాలు లేవన్నారు. అందుకే తాము తెలుగుదేశం పార్టీకి
మద్దతిచ్చామని చెప్పారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ ఓ డ్రామాగా ఆయన
అభివర్ణించారు. జగన్, కాంగ్రెసులకు తగిన
రీతిలో బుద్ధి చెప్పేందుకే టిడిపికి మద్దతు అన్నారు.
నారాయణ
వ్యాఖ్యలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పందించారు. సిపిఎం గెలిచే అవకాశాలు లేవన్న నారాయణ వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు.
గెలిస్తేనే పోటీ చేయాలనేది సిపిఐ
అభిప్రాయం కావొచ్చునని ఎద్దేవా చేశారు. గెలుపోటములతో సంబంధం లేకుండా సిపిఎం ఎన్నికల బరిలో నిలుస్తుందన్నారు.
ఒ బూర్జువా పార్టీని ఓడించేందుకు మరో బూర్జువా పార్టీతో
కలవాల్సిన అవసరం లేదన్నారు. బూర్జువా
పార్టీలతో ఓ అవగానహకు వచ్చినందు
వల్లే సిపిఐ టిడిపికి మద్దతిస్తుందేమోనని
ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలలో పోటీ
చేసే తమ అభ్యర్థులను నాలుగైదు
రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు.
తాము
పోటీ చేయని స్థానాలలో జయప్రకాశ్
నారాయణ ఆధ్వర్యంలోని లోక్సత్తాకు మద్దతు
ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. సిపిఎం, సిపిఐల మధ్య వివాదం సృష్టించిన
వారే సమాధానం చెప్పాలని నారాయణను ఉద్దేశించి అన్నారు. గెలిచే వారికే మద్దతు అన్న నారాయణ వ్యాఖ్యలు
తనను ఆశ్చర్యపరిచాయన్నారు. ఇక నుండి తాము
ఎవరితో పొత్తులు పెట్టుకున్నా ఎన్నికల వరకే అని చెప్పారు.
ఎన్నికల జరిగాక ఎవరి దారి వాళ్లదే
అని స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment