గుంటూరు:
మాజీ మంత్రి, స్వర్గీయ నేత పరిటాల రవీంద్ర
హత్య కేసులో మొదటి నిందితుడు దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
అయితే రెండో నిందితుడు వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ
నేతలు దూళిపాళ్ల నరేంద్ర, దాడి వీరభద్ర రావు
గురువారం ఆరోపించారు. గుంటూరు జిల్లాలో వారు మీడియాతో మాట్లాడారు.
నేరాలు
చేయడంలో వైయస్ జగన్ చాలా
దిట్ట అన్నారు. పరిటాల హత్య వెనుక జగన్
హస్తం ఉందన్నారు. తన అరాచకాలకు సాయం
చేసిన వ్యక్తులను కూడా హత్య చేయించే
మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్
అన్నారు. అలా చేయడం వల్ల
తన అరాచకాలలో రెండో సాక్ష్యం లేకుండా
చేస్తారన్నారు. ఆయన ఓ మేక
వన్నె పులి అని దుయ్యబట్టారు.
అనంతపురం
కోర్టు తీర్పుతో పరిటాల హత్యలో జగన్ హస్తం రుజువైందన్నారు.
నేరచరిత్రతో జగన్కు విడదీయరాని
సంబంధమన్నారు. అతను చేసెటువంటి నేరాలు
ప్రపంచంలో ఎవరూ చేయలేరేమో అన్నారు.
పరిటాల రవిని చంపేందుకు 2001లో
సూటుకేసు బాంబు పెట్టిన కేసులో
మంగళి కృష్ణకు అనంత కోర్టు శిక్ష
విధించిందని చెప్పారు.
అలాంటి
మంగళి కృష్ణతో జగన్కు ఉన్న
లింకును సిబిఐ ఎప్పుడో తేల్చి
చెప్పిందన్నారు. జగన్ పార్టీకి ఓటు
వేస్తే భస్మాసుర హస్తంలో చిక్కుకున్నట్లేనని వారు అన్నారు. జగన్,
ఆయన పార్టీ నేతలను తరిమి కొట్టేలా ఉప
ఎన్నికలలో తీర్పు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతి, నేర చరిత జగన్కు రెండు కళ్లు
అన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు అంటూ
ఊదరగొట్టే జగన్ అసలు స్వరూపం
ప్రజలు గుర్తించాలన్నారు.
0 comments:
Post a Comment