మాస్
మహరాజ్ రవితేజ తాజా సినిమా ‘దరువు’ చిత్రానికి
తెలంగాణ సెగలు తాకుతున్నాయి. ‘దరువు’ అనేది
తెలంగాణ సంస్కృతిక సంస్థ పేరని, ఆ
పేరు సినిమా టైటిల్గా పెట్టడాన్ని సహించబోమని
దరువు సంస్థ వ్యవస్థాపకుడు ఎల్లన్న
హెచ్చరించారు.
దరువు
పేరును సినిమాకు పెట్టడం దారుణమని, దరువు అనేది తెలంగాణకు
చెందిన ఓ సాంస్కృతిక సంస్థ
అని, దానిని ఓ అశ్లీల చిత్రానికి
పెట్టి తమ సంస్కృతిని అవమానించొద్దని
అన్నారు. ఈ రోజు సాయంత్రం
లోగా సినిమా పేరును మార్చుకోవాలని, లేదంటే జరగబోయే పరిణామాలకు ఆ సినిమా వారిదే
బాధ్యత అని హెచ్చరించారు.
తెలంగాణలోని
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి
కోసం పని చేస్తున్న దరువు
సంస్థ పేరును బూతు సన్నివేశాలతో చిత్రీకరించే
సినిమాలకు పెట్టడానికి వీల్లేదని, వెంటనే టైటిల్ మార్చాలని ఉస్మానియా జేఏసీ కూడా వార్నింగ్
ఇచ్చింది. టైటిల్ మార్చని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి
వస్తుందని తేల్చి చెప్పారు.
ఈ పరిణామాల నేపథ్యంలో దరువు యూనిట్ ఒక్కసారిగా
షాక్కు గురింది. ఇంత
కాలం లేని అభ్యంతరం....దరవు
ఆడియో విడుదల రోజైన ఈ రోజు
వార్నింగ్ రావడంతో ఏం చేయాలో పాలు
పోని స్థితిలో దర్శక నిర్మాతలు ఉన్నారు.
తెలంగాణ ఇష్యూ కావడంతో విడుదల
సమయంలో ఇబ్బందులు తప్పవు కాబట్టి...కుదిరితే వారితో రాజీ, లేకుంటే టైటిల్
మార్చడం లాంటి పరిణామాలు చోటు
చేసుకోవచ్చు. గతంలో తెలంగాణ సెగలకు
పలు సినిమాలు తీవ్రంగా నష్ట పోయిన సంగతి
తెలిసిందే.
సోషియో
ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈచిత్రానికి శౌర్యం ఫేం శివకుమార్ దర్శకత్వం
వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్
టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. హీరోయిన్ తాప్సీ రవితేజ సరసన రొమాన్స్ చేస్తుండగా...తమిళ నటుడు ప్రభు
ఇందులో యమధర్మరాజుగా కనిపించనున్నాడు.
0 comments:
Post a Comment