మనమంతా
దేవుడు తీసిన సినిమాలో పాత్రధారులమే.
అతని స్క్రీన్ప్లేలో పావులమే. మనమంటే కాలక్షేపం కోసం సినిమా చూస్తాం.
మరి మనల్ని సృష్టించిన దేవుడికీ ఎంటర్టైన్ మెంట్ కావాలి కదా.
అందుకే మనల్ని సృష్టించాడు అంటూ వేదాతం వల్లించారు
పూరీ జగన్నాధ్. అయితే ఈ వేదాంతానికి
ఈయన తాజా చిత్రం దేముడు
చేసిన మనుష్యులకీ సంభంధం ఉందంటున్నాడు. రవితేజ,ఇలియానా కాంబినేషన్ లో రూపొందుతున్న మా
సినిమాలో పాత్రలకూ, దేవుడికీ సంబధం ఉంది అని
చెప్పుకొచ్చారు.
అలాగే
ఆ సంభందం ఏమిటో అర్దం కావాలంటే...తప్పకుండా తమ సినిమా చూడాలి
అంటున్నారు పూరి జగన్నాథ్. ఆయన
దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'దేవుడు చేసిన మనుషులు' ప్రస్తుతం
బ్యాంకాక్లో చిత్రీకరణ జరుగుతోంది.
ఈ నెల 27 వరకూ అక్కడే కీలక
సన్నివేశాలు తెరకెక్కిస్తారు.దేవుడున్నాడని మనస్పూర్తిగా నమ్మి ఈ సినిమా
చూడండి అనే కార్డ్ వచ్చిన
తర్వాత సినిమా స్టార్ అవుతుంది. హండ్రెడ్ పర్శంట్ ఎంటర్టైనర్ ఇది. నాకు రవితేజ
కాంబినేషన్ లో చాలా మంచి
హిట్ సినిమా అవుతుంది అన్నారు.
హీరో
రవితేజ మాట్లాడుతూ...పూరీ జగన్నాధ్ కాంబినేషన్
లో ఇది ఐదవ చిత్రం.
ఈ కథ వినగానే ఎంతో
ఇన్ స్పైర్ అయ్యాను. ఈ చిత్రంలోని సన్నివేశాలు
వింటూంటే ఎప్పుడెప్పుడు షూటింగ్ చేస్తానా అని ఎంతో ఎక్సైట్
అయ్యాను. జగన్ కాంబినేషన్ లో
మరో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్
అందర్ని అలరించే సినిమా అవుతుంది. జగన్ తో చేస్తున్నందుకు
చాలా చాలా హ్యాపీగా ఉంది
అన్నారు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో
రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ
చిత్ర ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్ భారీ చిత్రాల నిర్మాత
చత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న దేముడు చేసిన మనుష్యులు షూటింగ్
పిబ్రవరి 17 ప్రారంభమై కంటిన్యూగా షూటింగ్ జరుపుకుంటోంది.
నిర్మాత
బివియస్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ..ఇడియట్ వంటి చాలా పెద్ద
రేంజి సినిమా అవుతుంది. వాణిజ్య విలువలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. పూరి
సినిమాల్లో కథానాయకుడి పాత్ర వైవిధ్యంగా ఉంటుంది.
ఈ సినిమాలోనూ అంతే. రవితేజ-పూరి
కలయికలో వచ్చిన చిత్రాల్లో ఇది ప్రత్యేక స్థానం
సంపాదించుకొంటుంది అన్నారు. రవితేజ సరసన ఇలియానా హీరోయిన్
గా చేస్తున్న ఈ సినిమాలో ప్రకాష్
రాజ్, బ్రహ్మానందం, అలీ,ఎంఎస్ నారాయణ,
కోవై సరళ, సుబ్బరాజు,ఫిష్
వెంకట్, జ్యోతిరానా వంటి వారు నటిస్తున్నారు.
ఫొటో గ్రఫి..శ్యామ్ కె నాయుడు, సంగీతం
..రఘు కుంచే, పాటలు..భాస్కర భట్ల, ఎడిటింగ్ ..ఎస్
ఆర్ శేఖర్. కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్సకత్వం...పూరీ
జగన్నాధ్.
0 comments:
Post a Comment