నాగార్జున
తో క్రిమినల్ తీసిన ప్రముఖ దర్శకుడు
మహేష్ భట్ గుర్తుండే ఉండి
ఉంటారు. ఆయన తాజాగా తన
రిటైర్ మెంట్ ని ప్రకటించారు.
ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ....కొత్త వాళ్లను ప్రోత్సాహించాలన్న
ఉద్దేశంతో తాను దర్శకత్వం నుంచి
తప్పుకుంటున్నట్టు మహేష్ భట్ ఈ రోజు
ముంబైలో ప్రకటించాడు. ఇప్పుడు తన వయసు 64 సంవత్సరాలనీ,
ఈ వయసులో కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో
తృప్తి ఉంటుందనీ ఆయన చెప్పుకొచ్చారు. తన
విశేష ఫిలిమ్స్ బ్యానర్‌పై పలు చిత్రాలు
నిర్మించి, పలువురు నటీనటుల్ని, దర్శకుల్ని కూడా ఆయన బాలీవుడ్కి పరిచయం చేశారు.
ఇకపై ఆయన నిర్మాతగానే కొనసాగుతానని
అన్నారు.
ఇక మహేష్ భట్...తన
మూడు దశాబ్దాల తన సుదీర్ఘ సినీ
పయనంలో సుమారు 50 సినిమాలకు దర్శకత్వం వహించారు. .అర్ద్, సారాంశ్, ఆషికీ, దిల్ హైకీ మాంతా
నహీ, సడక్, జుమాన్, సర్, గుమ్రా, స్వాభిమాన్,
పాపా కెహెతే హై, జకిమ్...వంటి
పలు విజయవంతమైన చిత్రాలను ఆయన రూపొందించారు. తెలుగులో
అక్కినేని నాగార్జున హీరోగా క్రిమినల్ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. కూతురు పూజాభట్ను హీరోయిన్గా
తీర్చిదిద్దారు. ఇలా దర్శకత్వానికి గుడ్
బై చెప్పటం బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. ఆయన నుంచి మరెన్ని
చిత్రాలు ఆశిస్తున్నామని చెప్తోంది.
ప్రస్తుతం
మహేష్ భట్...సన్నిలియోన్ ప్రధాన
పాత్రలో జిస్మ్ 2 చిత్రం రూపొందిస్తున్నారు. సన్నిలియోన్ ప్రధానపాత్రలో కనిపించనున్న 'జిస్మ్-2' షూటింగ్ మొదలు అయింది. రణ్‌దీప్ హుడా, అరుణోదయ్
సింగ్ కీలక పాత్రధారులు.ఇక
ఎనిమిదేళ్ల కిందట బాలీవుడ్లో
వచ్చిన 'జిస్మ్' సినిమాతో బిపాసా బసుకు గ్లామర్ భామగా
గుర్తింపు దక్కింది. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా
'జిస్మ్-2' తెరకెక్కబోతోంది. మహేష్ భట్ నిర్మిస్తున్నారు. పూజాభట్
దర్శకురాలు. తొలి చిత్రంలో బిపాసా
పోషించిన పాత్రను తాజాగా ఇండో-కెనేడియన్ నీలి
చిత్రాల తార సన్నీలియోన్ చేయబోతోంది.
ఇప్పటికే ఈమె మీద ఫొటోషూట్
చేశారు. ఆ ఫొటోలు ఇంటర్నెట్లో సంచలనం రేపాయి.
బిజినెస్ మంచి క్రేజ్ వస్తుందని
భావిస్తున్నారు.
సన్నీ
లియోన్ ఈ చిత్రం గురించి
మాట్లాడుతూ ''బిపాసా చేసిన 'జిస్మ్' చూశాను. అందులో ఆమె అందంగా ఉంది.
బాగా నటించింది. ఇప్పుడు నేను ఆమె పాత్రకు
తగ్గకుండా నటించాలని నిర్ణయించుకున్నాని'' తెలిపింది.
ఫోర్న్
స్టార్ సన్నిలియోన్ గత కొద్ది నెలలుగా
ప్రతీ రోజు ఏదో ఒక
న్యూస్ లో హెలెట్ అవుతూనే
ఉంది. ఈ చిత్రం ఓపినింగ్స్
అదిరిపోతాయని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు.
ఈ చిత్రం గ్యారెంటీగా ఓ వర్గానికి నచ్చుతుందని
నిర్మాతలు చెప్తున్నారు. మహేష్ భట్ సైతం
ఈ చిత్రం గ్యారెంటీగా తన హిట్ లిస్ట్
లో మరొకటిగా చేరుతుందనే నమ్మకంగా ఉన్నారు. ఈ వయస్సులోనూ ఆయన
తనదైన శైలిలో నిర్మాతగానూ సంచలనాలు క్రియేట్ చేస్తున్నారు. ఆయన బ్యానర్ లో
నటించటానికి ఇప్పటికీ బాలీవుడ్ సుందరీమణులు ఉవ్విళ్లూరుతూంటారు.
0 comments:
Post a Comment