అమెరికాకు
చెందిన లైఫ్ స్టయిల్ మోటార్సైకిళ్ల తయారీ కంపెనీ హ్యార్లీ
డేవిడ్సన్ ఇకపై గోవాలని
ప్రలజలకు చేరువ కానుంది. పర్యాటక
ప్రాంతంగా గోవా ఓ ప్రత్యేక
గుర్తింపును సంపాధించుకోవడమే కాకుండా, ఈ ప్రాంతంలో ధనిక
వర్గాలు కూడా అధికంగా ఉండటంతో
హ్యార్లీ డేవిడ్సన్ తమ నెక్స్ట్
స్టాప్కు గోవాను ఎంచుకుంది.
గోవాలోని
పంజిమ్లో హ్యార్లీ డేవిడ్సన్ తమ షోరూమ్ను ఏర్పాటు చేయనుంది.
హ్యార్లీ డేవిడ్సన్కు ఇండియాలో
ఇది 9వ డీలర్షిప్
కానుంది. భారత మార్కెట్లో హ్యార్లీ
డేవిడ్సన్ అందిస్తున్న అన్ని
రకాల మోడళ్లను ఈ గోవా డీలర్షిప్లో విక్రయించనుంది.
అంతేకాకుండా, ఈ డీల్షిప్లో హ్యార్లీ డేవిడ్సన్ యాక్ససరీలను కూడా
కంపెనీ అందించనుంది.
ప్రస్తుతం
హ్యార్లీ డేవిడ్సన్ దేశీయ మార్కెట్లో
15 మోటార్సైకిళ్లను అందిస్తోంది. భారత మార్కెట్లో హ్యార్లీ
డేవిడ్సన్ అందిస్తున్న ఉత్పత్తుల
ధరలు రూ.5.6 లక్షలు మొదలుకొని రూ.35.45 లక్షల వరకూ ఉన్నాయి.
గోవాలో ఇప్పటికే హ్యోసంగ్, డ్యుకాటి వంటి సూపర్బైక్
కంపెనీలు డీలర్షిప్లను
నెలకొల్పి విజయవంతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
0 comments:
Post a Comment