హైదరాబాద్:
తాను ఏ తప్పూ చేయలేదని
తారా చౌదరి సోమవారం చెప్పింది.
పోలీసులే తనను అనవసరంగా ఈ
కేసులో ఇరికించారని ఆమె ఆవేదన వ్యక్తం
చేసింది. తాను బెయిల్ పైన
బయటకు వస్తానని చెప్పింది. బయటకు వచ్చిన అనంతరం
కోర్టులో న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కాగా బంజారాహిల్స్ పోలీసుల
విజ్ఞప్తి మేరకు కోర్టు తారా
చౌదరిని నాలుగు రోజుల కస్టడీకి ఇచ్చిన
విషయం తెలిసిందే.
చంచలగూడ
మహిళా జైలులో ఉన్న ఆమెను బంజారాహిల్స్
పోలీస్ స్టేషన్కు తరలించారు. కస్టడీకి
తీసుకొని ఆమెను విచారిస్తున్నారు. విచారణకు
తీసుకు వెళ్లే సమయంలో ఆమె తాను తప్పు
చేయలేదని చెప్పింది. తారా చౌదరి సహచరుడు
ప్రసాద్ను పోలీసులు ఆదివారం
కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనను
పోలీసులు విచారించారు. ఆయనను కూడా కోర్టు
నాలుగు రోజుల కస్టడీకి అప్పగించింది.
వీరిద్దరిని తిరిగి 12వ తేదిన కోర్టులో
పోలీసులు హాజరుపర్చాల్సి ఉంది.
తారా
చౌదరిని కూడా నిన్ననే కస్టడీకి
తీసుకోవాల్సి ఉండగా కొన్ని కారణాల
వల్ల సోమవారం తీసుకున్నారు. కాగా ఉద్యోగాలు, సినిమా
అవకాశాల పేరిట అమ్మాయిలను వ్యభిచార
రొంపిలోకి దింపిందనే ఆరోపణల కారణంగా బంజారా హిల్స్ పోలీసులు ఇటీవల తారా చౌదరిని
అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఆమెతో పాటు సన్నిహితుడు ప్రసాద్ను కూడా అరెస్టు
చేశారు.
వారిద్దరి
నుంచి పలు కీలకమైన విషయాలను
రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఆడియో రికార్డు వివరాలతో
పాటు సెల్ ఫోన్ సంభాషణల
వివరాలను ఆమె నుంచి రాబట్టేందుకు
పోలీసులు ప్రయత్నిస్తారని అంటున్నారు. తారా చౌదరి సెల్
డైరీని పరిశీలిస్తే దిమ్మ తిరిగే విషయాలు
బయటపడుతున్నాయని అంటున్నారు. ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ తెలుగు
టీవీ చానెల్ ఓ వార్తా కథనాన్ని
ప్రసారం చేసింది. మూడు నెలల కాలంలో
తారా చౌదరి 8 వేల కాల్స్ చేసినట్లు
చెబుతున్నారు. గత మూడు నెలల
కాలంలో తారా చౌదరి సాగించిన
సంభాషణల వివరాలను పోలీసులు పరిశీలించినట్లు చెబుతున్నారు.
0 comments:
Post a Comment