మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్
నటించిన ‘రచ్చ’ సినిమాపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ చిత్రంలో బుద్దుని
విగ్రహం ముందు అశ్లీల సన్నివేశాలు
చిత్రీకరించారని, వెంటనే ఆ సన్నివేశాలను సినిమా
నుంచి తొలగించాలని ‘ఆలిండియా బుద్దిస్ట్ ఆర్గనైజేషన్’
ఈ పిటీషన్ దాఖలు చేసింది.
‘వాన
వాన వెల్లువాయె’ పాట కోసం గౌతమ
బుద్దుడి విగ్రహంతో ఓ సెట్ తయారు
చేశారు. ఇందులో బౌద్దుల మనోభావాలను కించ పరిచే విధంగా
అసభ్య సన్నివేశాలు చిత్రీకరించారని బుద్దిస్ట్ ఆర్గనైజేషన్ ఆరోపిస్తోంది. సినిమా విడుదల ముందు నుంచే ఈ
విషయంపై పలు మహిళా సంఘాలు
ఆందోళన చేపట్టాయి. తాజాగా ఈ అంశం హైకోర్టు
కెక్కడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సంపత్
నంది దర్శకత్వం వహించిన ఈచిత్రంలో చెర్రీ సరసన తమన్నా హీరోయిన్గా నటించింది. వివాదాస్పదంగా
మారిన ‘వాన వాన వెల్లువాయె’ పాట..చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలోని సూపర్
హిట్ పాటకు రీమిక్స్. మాస్
ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని
రూపొందించారు.
రామ్
చరణ్ తేజ్, తమన్నా, నాజర్,
కోటశ్రీనివాసరావు, ముఖేష్ రుషి, పార్తీబన్, బ్రహ్మానందం,
అలీ, గీత, ఝాన్సీ, ప్రగతి,
సుధ, హేమ అజ్మల్ తదితరులు
నటించిన ఈచిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్,
పారస్ జైన్ మెగా సూపర్
గుడ్ మూవీస్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి రచన:
పరుచూరి బ్రదర్స్, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్సాయి,
కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి,
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, సంగీతం: మణిశర్మ
0 comments:
Post a Comment