హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి తన జగతి పబ్లికేషన్స్
వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి
కోసమే తన ఉప ఎన్నికల
ప్రచారాన్ని వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ త్వరలో జరగనున్న
ఉప ఎన్నికల కోసం జోరుగా ప్రచారం
నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో
భాగంగా ఆయన శుక్రవారం శ్రీకాకుళం
జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఇందు కోసం
ఆయన గురువారమే హైదరాబాద్ నుండి బయలుదేరాల్సి ఉండె.
అయితే
జగన్ మాత్రం రెండు రోజులు తన
ఉప ఎన్నికల పర్యటన వాయిదా వేసుకుంటూ వచ్చారు. తన ఆస్తుల కేసులో
ఎ-2గా ఉన్న విజయ
సాయి రెడ్డి బెయిల్ పైన బయటకు వస్తున్నారన్న
నేపథ్యంలోనే జగన్ ఆయన కోసం
పర్యటన వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. తాను ప్రచారానికి వెళితే
నెల రోజుల వరకు పర్యటన
కొనసాగనుందని, కాబట్టి ఆయన బయటకు వస్తే
ఇప్పుడే మాట్లాడటం మంచిదని జగన్ భావించారని అంటున్నారు.
నరసన్నపేటలో
13న ప్రచారం ప్రారంభించాల్సి ఉండె. అయితే బెయిల్
వస్తుందోమేనని తెలిసిన జగన్ పర్యటన వాయిదా
వేసుకుంటూ వచ్చారు. శుక్రవారం సాయంత్రం విజయ సాయి రెడ్డిని
విడుదల చేశారు. దీంతో ప్రచారాన్ని మొదట
శనివారానికి వాయిదా వేసుకున్న జగన్ ఆ తర్వాత
ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. జగన్ శనివారం ఉదయం
విజయ సాయి రెడ్డిని కలిసి
సుదీర్ఘ మంతనాలు జరిపిన విషయం తెలిసిందే.
కేసు
విచారణ ప్రారంభమైనప్పటి నుంచి సిబిఐ ఎలా
వ్యవహరించింది, జగన్ అరెస్టు అవకాశాలు
ఎలా ఉన్నాయన్న పలు అంశాలపై చర్చించుకున్నట్లుగా
తెలుస్తోంది. లోటస్ పాండుకు వచ్చిన
విజయ సాయి మీడియాతో మాట్లాడారు.
తాను వైయస్ జగన్ విషయం
మాట్లాడబోనని చెప్పారు. వైయస్ జగన్ ఆస్తుల
కేసు గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు.
జైలు జీవితం దుర్భరమైందని ఆయన అన్నారు. సిబిఐ
తన పని తాను చేసుకు
పోతోందని ఆయన అన్నారు. సిబిఐ
తన బాధ్యత నెరవేరుస్తోందని ఆయన చెప్పారు. బెయిల్
ఇచ్చినందుకు ఆయన న్యాయస్థానానికి కృతజ్ఞతలు
తెలిపారు.
0 comments:
Post a Comment