కిల్మాన్రాక్: మందు ప్రియులకు
జానీ వాకర్ చేదు వార్త
అందించిందిద. విశేష ప్రాచుర్యం పొందిన
విస్కీ జానీ వాకర్ చివరి
సీసాను నింపిసి కంపెనీని మూసేయడానికి సిద్ధపడ్డారు. బ్లాక్, రెడ్ లేబుల్ విస్కీ
ప్రియులకు ఇది పెద్ద దెబ్బనే.
స్కాట్లాండ్లోని కిల్మాన్కర్క్లోని జానీ వాకర్
తయారీ కర్మాగారాన్ని మూసేస్తున్నారు. ఈ కర్మాగారం 1820 నుంచి
పనిచేస్తూ వస్తోంది.
కర్మాగారాన్ని
మూయకూడదని డీయాగియోకు నచ్చజెప్పడానికి స్కాటిష్ ప్రధాని అలెక్స్ సాల్మాండ్ నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు.
జానీ వారక్ కర్మాగారాన్ని మూసేస్తామని
కంపెనీ 2009లోనే ప్రకటించింది. ఇందులో
700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 430 మంది నష్టపరిహారంతో బయటకు
వెళ్లడానికి అంగీకరించారు. మరో 200 మందిని ఇతర ఉద్యోగాల్లో నియమించుకుంటున్నారు.
82 మందిని తొలగించారు.
చారిత్రాత్మకమైన
జానీ వాకర్ చివరి సీసాను
మ్యూజియంలో భద్రపరుస్తారు. వాకర్కు చెందిన
కిల్మాన్రాక్ విస్కీ సీసాను
1820లో మొదటిసారి విక్రయించారు. జానీ వాకర్ ప్రపంచవ్యాప్తంగా
పంపిణీ అవుతున్న అత్యంత ప్రాచుర్యం పొందిన బ్లెండెడ్ స్కాచ్ విస్కీ. ఏడాదికి 130 మిలియన్ సీసాలు అమ్ముడవుతూ వస్తున్నాయి.
0 comments:
Post a Comment