విజయవాడ:
తాను ఈ నెల 27వ
తేదిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరనున్నట్లు
విజయవాడకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు వంగవీటి
రాధాకృష్ణ బుధవారం ఓ టీవి ఛానల్తో చెప్పారు. తాను
తన కార్యకర్తలతో కలిసి జగన్ పార్టీలో
చేరతానని చెప్పారు.
1989లో
తన తండ్రి ప్రాణత్యాగం వల్లనే కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తనను కాంగ్రెసు పార్టీ
తీవ్రంగా మోసం చేసిందని ఆరోపించారు.
తన తండ్రి మృతి చెందితే ఎవరూ
కనీసం దండ వేయడానికి కూడా
రాలేదన్నారు. మా కుటుంబాన్ని కాంగ్రెసు
పార్టీ మోసం చేసిందన్నారు. తనతో
పాటు మరికొందరు ఇతర పార్టీలకు చెందిన
నేతలు కూడా కాంగ్రెసు పార్టీలో
చేరే అవకాశముందని ఆయన చెప్పారు.
కాగా
అంతకుముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి విజయవాడకు చెందిన వంగవీటి రాధా చేరేందుకు ముహూర్తం
ముహూర్తం ఖరారైందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తీవ్ర
తర్జన భర్జనల అనంతరం జూలై నాలుగో తేదిన
జగన్ పార్టీలో చేరేందుకు వంగవీటి రాధా నిర్ణయించుకున్నారని అప్పుడు వార్తలు
వచ్చాయి. అంతకుముందు గుంటూరు జిల్లాలో జగన్ను రాధాకృష్ణ
కలిసిన తర్వాత తాను వైయస్సార్ కాంగ్రెసు
పార్టీలో చేరనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
దీంతో
ఆయన ఎప్పుడు చేరుతారనే చర్చ జరిగింది. జగన్తో భేటీ అయిన
అనంతరం పలువురు వంగవీటి అనుచరులు జగన్ పార్టీలోకి వద్దని
వారించారట. దీంతో ఆయన ఆ
తర్వాత వెనక్కి తగ్గినట్లు కనిపించారని అంటున్నారు. ఆ తర్వాత రాధారంగ
మిత్ర మండలితో పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరం జగన్ పార్టీలో చేరితేనే
రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని అందరూ భావించారట. దీంతో
ఆయన జగన్ పార్టీలో చేరేందుకు
తన తండ్రి పుట్టిన తేది అయిన జూలై
నాలుగో తేదిని ఎంచుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఈ
రోజు 27న జగన్ పార్టీలో
చేరనున్నట్లు చెప్పారు.
0 comments:
Post a Comment