యంగ్
టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దమ్ము చిత్రం ఈ
నెల 27న విడుదలవుతున్న సంగతి
తెలిసిందే. విడుదలకు ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో ఈ
రోజు రాత్రి నుంచే సినిమా ప్రింట్లను
డిస్ట్రిబ్యూటర్లకు పంపిణీ చేయనున్నారు. రేపు సాయంత్రం లేదా
శుక్రవారం ఉదయం ప్రింట్లు ఆయా
థియేటర్లకు చేరనున్నాయి. శాటిలైట్ సిస్టం ద్వారా నడిచే థియేటర్లలో విడుదల
ముందు రోజు రాత్రే ఒకసారి
మిషనరీ సరిగా నడుస్తుందా? లేదా?
అనే విషయమై సరిచూసుకోనున్నారు.
సమయానికి
సినిమా విడుదల చేయడంలో విఫలం అయితే.... అభిమానులు
విధ్వంసం సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ
ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. అదే విధంగా విడుదల
రోజే ఎన్టీఆర్ అభిమానులు సినిమా చూడటానికి భారీగా తరలి వస్తారు. ఈ
నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా థియేటర్ల
వద్ద ముందు జాగ్రత్త ఏర్పాట్లు
చేస్తున్నారు. బ్లాక్ మార్కెటింగ్ కూడా జోరుగా సాగే
అవకాశం ఉన్నందున బ్లామార్కెటింగ్ గాళ్లపై ఓ కన్నేసి ఉంచారు.
జూనియర్
ఎన్టీఆర్, త్రిష, కార్తీక హీరో హీరోయిన్లుగా క్రియేటివ్
కమర్షియల్ బ్యానర్పై కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ
నిర్మించిన ఈ చిత్రానికి సూపర్
హిట్ మాస్ చిత్రాల దర్శకుడు
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఇది వరకు సింహా
లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందించిన బోయాపాటి...ఈ సారి తన
సినిమా దమ్మేంటో బాక్సాఫీసుకు రుచి చూపించడం ఖాయమని
అంటున్నారు.
ఈ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం ప్రేక్షకులను ఇప్పటికే ఊర్రూతలూగిస్తోంది. సినిమా ట్రైలర్లు కూడా పవర్ ఫుల్
గా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ చెప్పే డైలాగులు ఈచిత్రానికి హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.
మరి దమ్ము భవితవ్యం ఏమిటో...మరో రెండు రోజుల్లో
తేలనుంది.
0 comments:
Post a Comment