యంగ్
టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన
‘దమ్ము’
చిత్రం ఈ నెల 27న
విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అదే
రోజు మహేష్ బాబు-సుకుమార్
కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ బాక్సాఫీసు బరిలోకి దిగుతున్న రోజే... మహేష్ బాబు ఫైటింగ్కు రెడీ కావడం
కాకతాళీయమే అయినా....మ్యాటర్ ఆసక్తికరంగా ఉంది.
దర్శకుడు
సుకుమార్ ఏప్రిల్ 23వ తేదీనే ఈచిత్రం
షూటింగ్ ప్రారంభించాడు. మహేష్ బాబు, కాజల్
అగర్వాల్ పై పాట చిత్రీకరణ
ప్రారంభించారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరణ సాగుతోంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఏప్రిల్ 27వ తేదీ నుంచి
మొదలు పెట్టడానికి ప్లాన్ చేశారు.
ఇప్పటికే
బిజినెస్ మేన్ చిత్రంలో మహేష్
బాబుతో రొమాన్స్ చేసిన హీరోయిన్ కాజల్....తాజాగా రెండోసారి కూడా అవకాశం దక్కించుకుంది.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై ‘దూకుడు’ నిర్మాతలు అనిల్ సుంకర, గోపీచంద్
ఆచంట్, రామ్ ఆచంట ఈ
చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా పని చేస్తుండగా,
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మాస్
చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో దమ్ము చిత్రం రూపొందింది.
త్రిష, కార్తీక హీరోయిన్లు. కె.ఎస్.రామారావు
సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బేనర్పై అలెగ్జాండర్
వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కీరవాణి సంగీతం అందించారు.
0 comments:
Post a Comment