తిరుపతి:
త్వరలో తాను రాజకీయ ఆరంగేట్రం
చేస్తానని ప్రముఖ సినీ నటుడు, మాజీ
రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు ఆదివారం
చెప్పారు. ఆయన ఉదయం తిరుమల
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నానని చెప్పారు. దీనికి మీరు ఏ పార్టీలో
చేరతారని మీడియా మోహన్ బాబును ప్రశ్నించింది.
జర్నలిస్టులకు
నీతి, న్యాయం, ధర్మం తెలుసునని, జర్నలిస్టులు
అవినీతి లేకుండా చూస్తారని, మీరు ఏ పార్టీ
నీతిగా ఉందని చెబితే ఆ
పార్టీలో చేరుతానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలో
మీరే చెప్పాలని సూచించారు. తాను ప్రాణం ఉన్నంత
వరకు అవినీతిపై పోరాటం చేస్తానని చెప్పారు. గతంలోనూ తాను అవినీతిపై పోరాడానన్నారు.
ప్రజల కోసం, మన కోసం
అవినీతిపై పోరాడాల్సిందేనన్నారు.
అవినీతి
అంటే మన కళ్లు మనమే
పొడుచుకున్నట్లు అని చెప్పారు. ఐదేళ్ల
తర్వాత తానూ సోలో హీరో
రోల్ చేస్తున్నానని చెప్పారు. రావణ అనే ప్రాజెక్టు
ఇప్పుడు నడుస్తోందని చెప్పారు. అది రూ.అరవై
కోట్లతో రూపొందుతుందని చెప్పారు. శ్రీవారి దర్శనం తనకు అద్భుతంగా జరిగిందన్నారు.
స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని
చెప్పారు.
తెలుగుదేశం
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో
తనకు మంచి సంబంధముందని చెప్పారు.
చంద్రబాబు ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా
తన ఇంటికి వస్తారని, అలాగే తాను వారి
ఇంటికి వెళతానని చెప్పారు. ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త అన్నా
హజారే ఆశయాలకు అనుగుణంగా అవినీతిపై తన కంఠంలో ప్రాణం
ఉన్నంత వరకు పోరాడుతానన్నారు.
0 comments:
Post a Comment