చిత్తూరు:
తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రముఖ సినీ హీరో, మాజీ
రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు స్పందించేందుకు
శనివారం నిరాకరించారు. ఆయన చిత్తూరు జిల్లాలోని
శ్రీకాళహస్తి స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను
మీడియా పలకరించింది.
తాను
తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించేందుకు ఆయన విముఖత వ్యక్తం
చేశారు. అయితే త్వరలో తన
భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తానని స్పష్టం చేశారు. తాను దేవుడి దర్శనానికి
వచ్చానని, కాబట్టి రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. తాను సినిమాలకు కూడా
గత కొంతకాలంగా దూరంగా ఉన్నానని చెప్పారు.
కాగా
గత కొంతకాలంగా మోహన్ బాబు తెలుగుదేశం
పార్టీలో చేరే అవకాశముందనే ప్రచారం
జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల
మోహన్ బాబు తన అరవయ్యో
జన్మదిన వేడుకలను చిత్తూరు జిల్లాలోని తన విద్యా సంస్థలో
చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఆహ్వానించారు.
చంద్రబాబు
కూడా మోహన్ బాబు ఆహ్వానంతో
అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా మోహన్
బాబు తమ ఇద్దరి మధ్య
ఎలాంటి విభేదాలు లేవని, కేవలం కొన్ని మనస్పర్థలు
మాత్రమే వచ్చాయని చెప్పారు. చంద్రబాబు కూడా తమ తమ
వ్యక్తిగత పనుల వల్ల తాము
ఇరువురం కొంతకాలం దూరంగా ఉన్నామని చెప్పారు.
0 comments:
Post a Comment