ఏడాది
క్రితం జపాన్ను ఓ
విధ్వంసకర సునామీ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.
ఈ భయనాక ఘటనలో వేలాది
మంది అసువులుబాయగా, కోట్లాది రూపాయిల ఆస్తి నష్టం వాటిల్లింది.
విలయ తాండవం చేసిన సునామీ ధాటికి
అక్కడి వారి ఏటీఎం కార్డులు,
పాస్‌బుక్కులు గల్లంతైపోయాయి. ఈ అనుభవంతో ఏటీఎం
కార్డులు, పాస్‌బుక్కులు లేకుండా..
కేవలం అరచేతి ముద్రలను గుర్తించి డబ్బులు ఇచ్చే బయోమెట్రిక్ ఏటీఎం
మెషీన్‌ను ఏర్పాటు చేయాలని
టోక్యోలోని ఓ ప్రాంతీయ బ్యాంకు
‘ఒగాకీ క్యోరిట్సూ’ నిర్ణయానికొచ్చింది.
సెప్టెంబర్
నుంచి వీటి వినియోగం అమలులోకి
రానుంది. అయితే దీనిలో డబ్బులు
తీసుకోవడానికి..అరచేయి ముద్ర మాత్రమే సరిపోదండోయ్!!
పిన్ నంబరు, జనన తేదీ కూడా
ఇవ్వాల్సిందే. ఈ బయోమెట్రిక్ యంత్రాన్ని
ఫుజిట్సు సంస్థ వృద్థి చేసింది.
ఈ బయోమెట్రిక్ ఏటీఎంలను ప్రపంచంలో మొదటి సారిగా టర్కీలో
ప్రవేశపెట్టారు. ఈ వినూత్న ప్రయోగాన్ని
మన దేశంలోనూ అమలు చేస్తే ఏటీఎం
దొంగతనాలకు అడ్డుకట్ట పడ్డట్లే.
0 comments:
Post a Comment