హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఎ-2 నిందితుడు, జగతి
పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ
సాయి రెడ్డికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని
చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)
ఆదివారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించింది.
విజయ
సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో
సిబిఐ హౌస్ మోషన్ మూవ్
పిటిషన్ను దాఖలు చేసింది.
సిబిఐ పిటిషన్ను హైకోర్టు చీఫ్
జస్టిస్ స్వీకరించలేదు. సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు.
ఆయన సూచనల మేరకు సిబిఐ
సోమవారం హైకోర్టులో విజయ సాయి రెడ్డి
బెయిల్ పైన లంచ్ మోషన్
పిటిషన్ దాఖలు చేసే అవకాశం
ఉంది.
కాగా
జగన్ ఆస్తుల కేసులో మూడు నెలల క్రితం
అరెస్టైన విజయ సాయి రెడ్డికి
సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన
అదే రోజు సాయంత్రం జైలు
నుండి విడుదల అయ్యారు. జైలు నుండి విడుదల
అిన అనంతరం విజయ సాయి రెడ్డి
జగన్ ఆస్తుల కేసు తదితర అంశాలపై
మాట్లాడేందుకు నిరాకరించారు.
శనివారం
ఉదయం ఆయన జగన్మోహన్ రెడ్డితో
సుదీర్ఘ సమయంపాటు భేటీ అయ్యారు. ఈ
భేటీలో కేసు విచారణ ప్రారంభమైనప్పటి
నుంచి సిబిఐ ఎలా వ్యవహరించింది,
జగన్ అరెస్టు అవకాశాలు ఎలా ఉన్నాయన్న పలు
అంశాలపై చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. లోటస్ పాండుకు వచ్చిన
విజయ సాయి మీడియాతో మాట్లాడారు.
తాను వైయస్ జగన్ విషయం
మాట్లాడబోనని చెప్పారు.
వైయస్
జగన్ ఆస్తుల కేసు గురించి ఏమీ
మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. జైలు
జీవితం దుర్భరమైందని ఆయన అన్నారు. సిబిఐ
తన పని తాను చేసుకు
పోతోందని ఆయన అన్నారు. సిబిఐ
తన బాధ్యత నెరవేరుస్తోందని ఆయన చెప్పారు. బెయిల్
ఇచ్చినందుకు ఆయన న్యాయస్థానానికి కృతజ్ఞతలు
తెలిపారు.
0 comments:
Post a Comment