శ్రీకాకుళం:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించింది. ఆదివారం వైయస్ జగన్మోహన్ రెడ్డి
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉప ఎన్నికల ప్రచారం
కోసం వచ్చారు. ఈ సందర్భంగా తమ
అభిమాన నేత వైయస్ జగన్మోహన్
రెడ్డిని చూసేందుకు భారీగా జనాలు తరలి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన సెక్యూరిటీ అభిమానులపై
మరోసారి కటువుగా వ్యహరించింది.
జగన్ను చూసేందుకు ఓ
మహిళ అక్కడకు వచ్చింది. అభిమానంతో చూసేందుకు వచ్చిన ఆ మహిళను సెక్యూరిటీ
సిబ్బంది పక్కకు నెట్టి వేశారు. దీంతో ఆమెకు తీవ్ర
గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను పార్టీ కార్యకర్తలు
స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స
అందిస్తున్నారు.
కాగా
వైయస్ జగన్మోహన్ రెడ్డి వారిస్తున్నప్పటికీ ఆయన సెక్యూరిటీ మాత్రం
ఇలాంటి చర్యలు మానుతున్నట్లుగా కనిపించడం లేదు. పది పదిహేను
రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం
ఇది మూడోసారి. ఇటీవల జగన్ మెదక్
జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో జరిగిన అల్లర్ల బాధితులను పరామర్శించేందుకు అక్కడకు వెళ్లారు. ఆయనను చూసేందుకు భారీగా
అభిమానులు వచ్చారు. వారిని అదుపు చేసే సమయంలో
ఆయన సెక్యూరిటీ సిబ్బంది వారిపై చేయి చేసుకుంది.
అంతకుముందు
కూడా గోదావరి జిల్లాలో అభిమానులు, పార్టీ కార్యకర్తలపై సెక్యూరిటీ చేయి చేసుకుంది. ఈ
ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ తర్వాత జగన్
మాట్లాడుతుండగా వేదిక పై ఉన్న
జర్నలిస్టును తోసి వేశారు. దీంతో
అతనికి స్వల్ప గాయాలయ్యాయి. జగన్ అప్పుడే సెక్యూరిటీని
వారించారు.
0 comments:
Post a Comment