తిరుపతి/విశాఖపట్నం: హీరో పవన్ కల్యాణ్కు స్వల్ప గాయాలయ్యాయి.
ఆదివారం ఆయన విశాఖపట్నం చేరుకున్నారు.
అక్కడ ఆయన సింహాద్రి అప్పన్న
స్వామిని దర్శించుకున్నారు. పవన్ కల్యాణ్ వచ్చిన
విషయం తెలిసి భారీగా ఆయన అభిమానులు అక్కడకు
తరలి వచ్చారు. పవన్ను చూసేందుకు
అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో అభిమానుల
మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ స్వల్ప
తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు
కింద పడ్డారు.
ఈ తోపులాటలో హీరో పవన్ కల్యాణ్కు కూడా స్వల్పంగా
గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీఛార్జ్
చేసి అభిమానులను చెదరగొట్టారు. కాగా అంతకుముందు పవన్
కల్యాణ్ చిత్తూరు జిల్లా తిరుపతి చేరుకున్నారు. అక్కడ తిరుమల శ్రీ
వేంకటేశఅవర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పవన్
కల్యాణ్ను మీడియా పలకరించింది.
తాను సినిమాల గురించి ఏమీ మాట్లాడనని చెప్పారు.
గబ్బర్
సింగ్ సినిమా విషయమై ప్రేక్షకులే తీర్పు ఇస్తారని చెప్పారు. తనకు ఎప్పుడు కూడా
సినిమాల గురించి మాట్లాడే అలవాటు లేదని చెప్పారు. గబ్బర్
సింగ్ ప్రేక్షకులకు నచ్చుతుందనే తాను భావిస్తున్నట్లు చెప్పారు.
సినిమా గురించి తాను చెప్పడం కంటే
అభిమానులు, ప్రేక్షకులు చెబితే బాగుంటుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
కాగా
విశాఖలో మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడారు. సినిమాకు మంచి సాంగ్స్ ఇచ్చామని
చెప్పారు. సినిమా తప్పక హిట్ అవుతుందన్న
నమ్మకం తమకు ఉందని చెప్పారు.
కాగా పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో
నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ఆడియో
ఆదివారం సాయంత్రం విడుదలవుతున్న విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment