హైదరాబాద్:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
పని తీరు బాగా లేదని
తాను ఎఐసిసి పరిశీలకుడు వాయలార్ రవితో చెప్పానని, తన
అభిప్రాయంతో వాయలార్ రవి విభేదించలేదని కాంగ్రెసు
అసమ్మతి శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. తనకు మంత్రి పదవిపై
మోజు లేదని ఆయన చెప్పారు.
వాయలార్ రవితో సమావేశానంతరం ఆయన
మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మొదటి నుంచీ విభేదిస్తున్నారు.
కాగా,
మంత్రి గల్లా అరుణ కూడా
వాయలార్ రవిని కలిశారు. ప్రభుత్వ
పథకాలు బాగున్నాయని తాను చెప్పినట్లు ఆమె
తెలిపారు. ఉప ఎన్నికల గురించి
తాను ఏమీ మాట్లాడలేదని ఆమె
చెప్పారు. చిత్తూరు ముఖ్యమంత్రి సొంత జిల్లా అని,
దాంతో తాను ముఖ్యమంత్రికే చిత్తూరు
జిల్లాలోని ఉప ఎన్నికల విషయాన్ని
వదిలేశానని ఆమె చెప్పారు. తిరుపతి
నుంచి తన అబ్బాయి జయదేవ్ను పోటీకి దించాలని
తాను అనుకుంటున్నానని, తప్పకుండా గెలుస్తాడని ఆమె అన్నారు.
తెలంగాణ
నాయకులు విడతలవారీగా వాయలార్ రవితో కలిశారు. కె.
కేశవరావు నివాసంలో పార్లమెంటు సభ్యులు సమావేశమై ఆ తర్వాత వాయలార్
రవి వద్దకు వెళ్లారు. తెలంగాణ ప్రత్యామ్నాయం లేదని సమావేశానంతరం రవిని
కలవడానికి ముందుకు కేశవరావు అన్నారు. ఈ నెల 24వ
తేదీ నుంచి జరిగే పార్లమెంటు
సభ్యులు అనుసరించాల్సిన వైఖరి గురించి చర్చించుకున్నామని
ఆయన చెప్పారు. తెలంగాణపై తమకు రాజీ లేదని
ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు.
పార్టీ
పరిస్థితి రాష్టంలో అధ్వాన్నంగా ఉందని పార్లమెంటు సభ్యుడు
మందా జగన్నాథం అన్నారు. తెలంగాణపై ఉప ఎన్నికలకు ముందే
నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. వాయలార్
రవి కీలకమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. వాస్తవ
పరిస్థితులు వాయలార్ రవికి వివరిస్తామని మరో
పార్లమెంటు సభ్యుడు వివేక్ అన్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
తెలంగాణపై తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి
అందరినీ కలుపుకుని వెళ్లాలని ఆయన సూచించారు.
0 comments:
Post a Comment