బోయపాటి
శ్రీను దర్సకత్వంలో ఎన్టీఆర్,త్రిష,కార్తీక కాంబినేషన్
లో తెరకెక్కుతున్న చిత్రం 'దమ్ము'. ఈ చిత్రం ఏప్రియల్
27న విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం వేగవంతంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిఐ
ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో
నడుస్తోంది. ఈ పనులన్నీ పూర్తి
చేసుకుని ఏప్రియల్ 19న ఫస్ట్ కాపీ
వచ్చే అవకాసం ఉంది. ఈ చిత్రం
రీ రికార్డింగ్,వి ఫిఎక్స్ లు
కూడా పూర్తయ్యాయి. సెన్సార్ కి ఈ చిత్రం
ఈ నెల 19 లేదా 20న జరగనుందని తెలుస్తోంది.
ఇక 'దమ్ము'లో ఎన్టీఆర్
డిఫెరెంట్ గా సాగుతుంది. దాని
గురించి దర్శకుడు బోయపాటి శ్రీను వివరిస్తూ...అందరూ బాగుండాలి. అందరిలో
నేనుండాలి...ఇదీ ఓ యువకుడి
సిద్ధాంతం. అందుకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా అతను
ఊరుకోడు. తన దారికి అడ్డొచ్చిన
వారికి దమ్ము చూపేదాకా వదలడు.
ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే
అంటున్నారు .
అలాగే
... ఎన్టీఆర్ నటనను ఇప్పటిదాకా ఒకవైపే
చూశారు. రెండోవైపు చూపించే చిత్రమిది. నడక, స్త్టెల్... అన్ని
విషయాల్లోనూ వైవిధ్యం ప్రదర్శించారు. ప్రతి ప్రేక్షకుడు సంతృప్తిపడేలా,
ప్రతి అభిమానీ గర్వపడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
కీరవాణి స్వరపరిచిన పాటలకి చక్కటి స్పందన లభిస్తోంది. నిర్మాత వల్లభ సహకారం మరిచిపోలేనిదని
అన్నారు.
నిర్మాత
కె.ఎస్.రామారావు మాట్లాడుతూ
''ఎన్టీఆర్ అభిమానుల అంచనాలను మించిపోయేలా ఈ చిత్రం ఉంటుంది.
కథపై పట్టున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన ఈ చిత్రాన్ని
మలిచిన విధానం చాలా బాగుంది. మా
అబ్బాయి ఈ చిత్రంతో నిర్మాతగా
పరిచయమవుతున్నాడు. ఒక గొప్ప చిత్రాన్ని
తీశామన్న ఆనందం కలిగింది. ప్రస్తుతం
రీరికార్డింగ్ పనులు తుదిదశలో ఉన్నాయి.
పది రోజుల్లో సెన్సార్కి వెళతామని''అన్నారు.
నిర్మాణానంతర
కార్యక్రమాలు తుదిదశకు చేరుకొన్నాయి. ఈ నెల 27న
చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. భానుప్రియ, నాజర్, సుమన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,
శుభలేఖ సుధాకర్, అలీ తదితరులు ఇతర
పాత్రధారులు. రచన: ఎమ్.రత్నం,
పాటలు: చంద్రబోస్, కెమెరా: ఆర్థర్ విల్సన్. ఈ చిత్రానికి కె.ఎ.వల్లభ నిర్మాత.
కె.ఎస్.రామారావు సమర్పకులు.
0 comments:
Post a Comment