న్యూఢిల్లీ:
కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంలో యువతకు,
సీనియర్లకు మధ్య వివాదాలు వెలుగులోకి
వస్తున్నాయి. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు, పార్లమెంటు
సభ్యుడు రాహుల్ గాంధీ మన్మోహన్ గాంధీ
జట్టు పట్ల తీవ్ర అసంతృప్తితో
ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీకి, మన్మోహన్ సింగ్కు మధ్య
విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో 2012లోగానే నాయకత్వ మార్పు జరుగుతుందని వార్తాకథనాలు వస్తున్నాయి.
ప్రధానిగా
మన్మోహన్ను తప్పించి రాహుల్
గాంధీ బాధ్యతలు చేపడతారని అంటున్నారు. అయితే, ఇందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు, రాహుల్ గాంధీ తల్లి ఆమోదం
లభించాల్సి ఉంది. మన్మోహన్ సింగ్
మంత్రివర్గం పరిస్థితులను గందరగోళంగా తయారు చేస్తున్న తీరుపై
రాహుల్ గాంధీ దాదాపుగా ప్రతి
రోజూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన వర్గానికి చెందిన
నాయకులు అంటున్నారని మీడియా రాసింది.
మన్మోహన్
జట్టు పూర్తిగా చెడిపోయిందని, శస్త్ర చికిత్స అవసరమని, కాంగ్రెసు మనుగడ సాగించాలంటే అది
తప్పదని అంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మన్మోహన్ సింగ్ జట్టు స్థానంలో
రాహుల్ గాంధీ అధికార పగ్గాలు
చేపట్టడానికి సిద్ధంగా ఉందని రాహుల్ వర్గం
అంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
పార్టీ
ఇమేజ్ను పెంచుతారని భావించిన
మంత్రులు అందుకు ఉపయోగపడకపోగా, పార్టీ ప్రతిష్ట దెబ్బ తినేలా చేశారని
రాహుల్ గాంధీ వర్గం విమర్శిస్తోంది.
2012 ఆఖరులోగా ప్రధాని పదవి చేపడితేనే 2014 ఎన్నికలకు
రాహుల్ గాంధీ పార్టీని సిద్ధం
చేయగులుతారని అంటున్నారు. రెండేళ్ల పాటు కృషి చేస్తే
పార్టీని బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ కూడా భావిస్తున్నట్లు
చెబుతున్నారు.
0 comments:
Post a Comment