రజనీకాంత్
అల్లుడు ధనుష్ హీరోగా, ఆయన
కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో వచ్చిన ‘3’ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీసు
వద్ద బొక్కబోర్లా పడటంతో ఆ చిత్రాన్ని కొనుగోలు
చేసిన పంపిణీ దారులంతా తీవ్రంగా నష్టపోయారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ
అమౌంట్ ఇచ్చి సొంతం చేసుకున్నానని
విడుదల ముందు వరకు భాహాటంగా
చెప్పుకున్న నిర్మాత నట్టి కుమార్ సినిమా
తొలి రోజే నెగెటివ్ టాక్
తెచ్చుకోవడంతో ఖంగు తిన్నారు.
కొలవెరి
పాట ఫీవర్ తనకు కలెక్షన్ల
వర్షం కురిపిస్తుందని ఆశించన నట్టి ఆ సినిమా
తనకు చేసిన నష్టం వల్ల
వచ్చిన ఫీవర్ను తట్టుకోలేక
పోతున్నారు. ఇటీవల ఓ ఇంగ్లీష్
డైలీతో మాట్లాడుతూ రజనీకాంత్ కుటుంబం నష్టపోయిన తనను ఆదుకుంటుందని చెప్పినట్లు
చెప్పడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇంతలోనే ఆ సినిమాతో తనకు
సంబంధం లేదని రజనీకాంత్ మీడియాకు
లేఖ రాయడంతో ఈ వ్యవహారం ఆసక్తి
కరంగా మారింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఓ తెలుగు టీవీ
చానల్తో నట్టి కుమార్
మాట్లాడుతూ....రజనీకాంత్కు ఈ సినిమాకు
ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
అయితే ఆయన అల్లుడు ధనుష్
నష్ట పోయిన తనకు డబ్బులు
తిరిగి ఇప్పిస్తానని చెప్పారని అన్నారు. ‘3’ సినిమా నిర్మాత కస్తూరి రాజా తనను మోసం
చేశాడని నట్టి ఆరోపించారు. రూ.
6.40 కోట్లు వెచ్చించి తెలుగు హక్కులు దక్కించుకున్నానని, సినిమా ఆడక పోవడంతో 80% నష్టపోయానని,
కేవలం రూ. 1.60 కోట్ల షేర్ మాత్రమే
వచ్చిందని నట్టి ఆవేదన వ్యక్తం
చేశారు.
'కొలవెరి
డి...'పాటతో రిలీజ్ కు
ముందే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న 'త్రీ' తెలుగులోనూ అట్టహాసంగానే
విడుదలైంది. ధనుష్ భార్య ఐశ్వర్య
దర్సకురాలిగా పరిచయమతూ చేసిన ఈ చిత్రం
అంచనాలకు ఆమడ దూరంలోనే ఉండిపోయింది.
ఫస్టాఫ్ చక్కటి ప్రేమకథను ఆవిష్కరించిన ఈ చిత్రం సెకండాఫ్
లో హఠాత్తుగా మాయరోగాన్ని రంగంలోకి దింపి ప్రేక్షకులను సహన
పరీక్ష పెట్టింది. తొలి రోజే సినిమా
నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాకు
కలెక్షన్లు కరువయ్యాయి.
0 comments:
Post a Comment