విశాఖపట్నం/హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై కేంద్ర మానవ వనరుల సహాయ
మంత్రి దగ్గుపాటి పురేంధేశ్వరి గురువారం స్పందించారు. ఆమె తన నియోజకవర్గం
విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రజాపథం కార్యక్రమంలో
ఉదయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె
మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని
మార్చుతారనే ఊహాగానాలను ఆమె కొట్టి పారేశారు.
పార్టీ అధిష్టానానికి ఆయనను మార్చే ఉద్దేశ్యం
ఏ మాత్రం లేదని చెప్పారు.
ఆయనను
మార్చుతారని పార్టీ అధిష్టానం కానీ, పార్టీ ముఖ్య
నేతలు కానీ చెప్పారా అని
ఆమె ప్రశ్నించారు. అవన్నీ కేవలం ఊహాగానాలే అన్నారు.
మనకు మనం అనుకుంటే ఎలా
అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి
అద్భుతంగా పాలిస్తున్నారని కితాబు ఇచ్చారు. కాంగ్రెసు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రవేశ పెట్టిన
ఏ ఒక్క పథకాన్ని ఈ
ప్రభుత్వం తొలగించలేదన్నారు.
ప్రజాపథం,
రచ్చబండ కార్యక్రమాలే ఏ పథకం ఎత్తివేయలేదనడానికి
మంచి నిదర్శనం అని చెప్పారు. పార్టీ
పథకాలు అన్నీ విలక్షణమైనవే అని
చెప్పారు. పాలన బాగుందన్నారు. త్వరలో
జరగనున్న ఉప ఎన్నికల నియోజకవర్గాల
అభ్యర్థులపై పార్టీ దృష్టి సారించిందని చెప్పారు. అందులో భాగంగానే సీనియర్ నేత వాయలార్ రవి
రాష్ట్రానికి వచ్చారన్నారు.
ముఖ్యమంత్రి
కిరణ్ రెడ్డికి గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు కూడా కితాబు
ఇచ్చారు. కిరణ్ నిజాయితీ పాలన
అందిస్తున్నారని చెప్పారు. గిట్టని వాళ్లే ఆయనకు వ్యతిరేకంగా విమర్శలు
చేస్తున్నారని అన్నారు. తాను ఇంచార్జిని కాదని
కేవలం పార్టీ కార్యకర్తలను మాత్రమేనని చెప్పారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో కాంగ్రెసును
గెలిపించే బాధ్యత తనది కాదని చెప్పారు.
గుంటూరు
జిల్లా పత్తిబాడు నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేసే అభ్యర్థిని
గెలిపించుకుంటానని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి నియోజకవర్గాలకు
విడుదలయ్యే నిధులు ప్రజాపథం కార్యక్రమాలను మెరుగ్గా అమలు చేసేందుకే తప్ప
ఓట్ల కోసం కాదన్నారు. ఆయనంటే
పడని వాళ్లు విమర్శలు చేస్తున్నారన్నారు.
రచ్చబండలో
హామీ మేరకే నిధుల విడుదల
అన్నారు. ఆయన మంత్రి మాణిక్య
వరప్రసాద్తో కలిసి పత్తిపాడు
నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో
సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
0 comments:
Post a Comment