రామ్
చరణ్ తేజ్-ఉపాసన కామినేని
వివాహ తేదీ ఫిక్సైనట్లు సమాచారం.
జూన్ 14, 2012, ఉదయం 9:45కి ఈ వివాహ
సుముర్తాన్ని నిర్ణయించినట్లుగా చెప్తున్నారు. ఇక ఇటీవలే ఈ
జంట నిశ్చితార్థం అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో జరిగింది. ఇక
ఇప్పటికే ఉపాసన, రామ్చరణ్లది
చక్కని జంట అని అంతా
ప్రశంసించారు. పెళ్లి ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నామన్నారు.
తనకు తిరుపతి పుట్టినిల్లు లాంటిదని చిరంజీవి చెప్పడంతో దైవం చెంతనే రిసెప్షన్ను తన స్వగ్రామమైన
అర్ధగిరిలో ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.
కాగా
వీరి వివాహానికి దేశంలోని అన్ని సినీ పరిశ్రమలకు
చెందిన ప్రముఖులు, కేంద్ర స్థాయిలోని బడా రాజకీయ నాయకులు,
వ్యాపారులు హాజరు కానున్నారని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన నిశ్చి తార్థ వేడుకకు అభిమానులకు
చోటు లేకుండా పోయింది. ఈ పెళ్లి వేడుకలో
వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు
చేస్తారా? లేదా అనే అంశం
కూడా సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ఇక చిరంజీవి ఈ పంక్షన్ కోసం
ఏర్పాట్లును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఆయన సన్నిహితులకు ప్రత్యేకంగా
ఈ వివాహ పనులు ఆయన
పురమాయించారు. ఏ లోటు లేకుండా
గ్రాండ్ గా ఈ వివాహం
అంగరంగ వైభోగంగా జరగాలని ఆయన అభిలషిస్తున్నారు. ఇక
ఈ వివాహ విషయంతో మెగా
అభిమానలలో ఉత్సాహం పొంగిపొరులుతోంది. మరో ప్రక్క ఉపాసన
ఇంటిలోనూ ఈ పెళ్లి పనులు
గత నెల రోజులుగా కంటిన్యుగా
జరుగుతున్నాయి. వివాహానికి సంభందించి రామ్ చరణ్ సైతం
తన సలహాలను సూచనలను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ సహకిస్తున్నట్లు చెప్తున్నారు.
రామ్
చరణ్ ప్రస్తుతం జంజీర్ రీమేక్ షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్నారు. రచ్చతో హిట్ కొట్టిన రామ్
చరణ్ ఈ సంవత్సరం బాగా
కలిసివస్తోందని భావిస్తున్నారు. హిందీ ఎంట్రీ ఇవ్వడం,
ఓ ఇంటివాడవటం, సంవత్సరం ప్రారంభంలోనే కొట్టిన హిట్ తో ప్లాప్
నుంచి బయిటపడటం వంటివి జరిగాయి. ఇక ఈ చిత్రంతో
సైమన్టైస్ గా వంశీ పైడిపల్లి
దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఎవడు కు సైతం
పనిచేస్తున్నారు. వివాహం పేరు చెప్పి కేవలం
పదిహేను రోజులు మాత్రమే సినిమాలుకు గ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
0 comments:
Post a Comment