యుగానికొక్కడు,
ఆవారా, నాపేరు శివ చిత్రాల ద్వారా
తెలుగునాట మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న
తమిళ హీరో కార్తి త్వరలో
‘శకుని’గా రాబోతున్నాడు. ఈచిత్రం
ఆడియో మే 2వ వారంలో
విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ చిత్రం ఆడియోను
విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రణీత
హీరోయిన్ గా చేస్తున్న ఈ
చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ తాజాగా కార్తితోనే
ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బెల్లంకొండ సురేష్ తెలులుగులో విడుదల చేయబోతున్నారు. శంకర్దయాళ్ దర్శకత్వం
వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్
చివరి దశకు చేరుకొంది. త్వరలో
సినిమానీ విడుదల తేదీని ప్రకటించనున్నారు.
దర్శకుడు
శంకర్ దయాళ్ మాట్లాడుతూ, 'బాల్యదశలో ఉన్న ఓ పిల్లవాడు
యవ్వనం వరకు సాగే ప్రయాణం
ఎలా ఉంటుందో ఈ చిత్రంలోని కథానాయకుడు
రాజకీయాల్లోకి ప్రవేశించే క్రమం ఆ విధంగా
ఉంటుంది. రాజకీయంగా అతనిని కలిసే ప్రతివ్యక్తి మలుపుకి
కారణమవుతాడు. ఎదుటివాళ్ళు కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వం
ఈ చిత్రంలోని హీరోది' అని చెప్పారు.
'శకుని
అంటే దుష్ట ఆలోచనలే అనుకోవద్దు.
ఓ సమస్య నుంచి తెలివిగా
ఎలా బయటపడాలో అతనికి బాగా తెలుసు. ప్రజాస్వామ్యంలో
శకుని స్వభావం ఉన్నవాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. ప్రస్తుతం మధ్యవర్తులు లేకపోతే... ఏ పనీ జరగడం
లేదు. లంచం ఇవ్వకపోతే ఫైలు
కదలడం లేదు. ఈ వాతావరణంలో
ఓ యువకుడు శకునిలా తన పనులను చక్కబెట్టుకొన్నాడు
అనేదే 'శకుని'చిత్రం స్టోరీ
లైన్.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట
శ్రీనివాసరావు, రాధిక, నాజర్, రోజా, సంతానం తదితరులు
తారాగణం. ఈ చిత్రానికి మాటలు:
శశాంక్ వెన్నెలకంటి, పాటలు: సాహితి, సంగీతం: జి.వి.ప్రకాష్కుమార్, ఛాయాగ్రహణం: పి.జి.ముత్తయ్య,
ఎడిటింగ్: శ్రీకర్ప్రసాద్, ఆర్ట్: రాజీవన్, ఫైట్స్: అనల్ అరసు, డాన్స్:
ప్రేమ్రక్షిత్, బాబా భాస్కర్, సహ
నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్,
ఎస్.ఆర్.ప్రభు, నిర్మాత:
కె.ఇ.జ్ఞానవేల్రాజా,
దర్శకత్వం: ఎన్.శంకర్ దయాళ్.
0 comments:
Post a Comment