న్యూఢిల్లీ:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
జైలుకు వెళ్లడం ఖాయమని ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి అన్నారు. రాష్ట్రంలో
ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని ఆమె తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా లేదని ఆమె అన్నారు.
సోమవారం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా ప్రతినిధులతో
మాట్లాడారు. రైతుల కోసం మొసలి కన్నీరు
కారుస్తున్న జగన్ తన సంపాదనలో
ఒకటి రెండు శాతం కేటాయించినా
రైతుల సమస్యలన్నీ తీర్చవచ్చునని ఆమె అన్నారు
బడ్జెట్కు ముందు రెండు
శాతం సంపాదన ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నాడా?
అని సవాల్ విసిరారు. ఉప
ఎన్నికల్లో జగన్ దూకుడు చూపిస్తాడని
ప్రస్తావించగా.. ఆయన జైలుకు పోవటం
ఖాయమని, జైల్లో దూకుడు చూపించుకోవాలని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులంతా సమన్వయంతో వ్యవహరిస్తూ ఉప ఎన్నికలపై దృష్టి
పెట్టారని చెప్పారు. ఉత్తేజంతో పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకుల్ని ఆటంకపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
రేణుకా
చౌదరి ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన
విషయం తెలిసిందే. ఆమె ఆ మధ్య
కాలంలో ఎఐసిసి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఆమెకు కేంద్రంలో చిరంజీవితో
పాటు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం
ఉంది.
0 comments:
Post a Comment