హైదరాబాద్:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
అసంతృప్తుల జాబితాలో కార్మిక శాఖ మంత్రి దానం
నాగేందర్ కూడా చేరిపోయారు. సోమవారం
వస్త్రాలపై వ్యాట్ అంశంపై దానం, మరో మంత్రి
శైలజానాథ్ మధ్య జరిగిన ఓ
సమావేశంలో తీవ్ర వాగ్వాదం జరిగింది.
వస్త్ర వ్యాపారులపై వ్యాట్ను రద్దు చేయాలని
దానం మొదటి నుండి చెబుతున్నారు.
దానం మొదట్నుంచీ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశాన్ని ఆయన
పలుమార్లు ప్రస్తావించారు.
కొందరు
పెద్ద స్థాయి వస్త్ర వ్యాపారుల కోసం ప్రభుత్వం లేదంటూ
శైలజానాథ్ చేసిన వ్యాఖ్యలపై దానం
అప్పుడే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ కుటుంబం వస్త్ర
వ్యాపారం చేస్తోందని అందులోని సాధక బాధకాల పట్ల
తనకు అవగాహన ఉందని, పైగా తన నియోజకవర్గంలో
పలువురు వస్త్ర వ్యాపారులు నివసిస్తున్నారని దానం చెప్పారు. దేశవ్యాప్తంగా
అమలు చేస్తున్న వ్యాట్ను ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే రద్దు చేస్తే
కేంద్ర నిధుల విడుదలకు ఇబ్బందులు
తలెత్తుతాయని ముఖ్యమంత్రి ఆ సమావేశంలో పేర్కొన్నారు.
కానీ
తాజాగా వస్త్ర వ్యాపారులపై వ్యాట్ను తగ్గిస్తూ నిర్ణయం
తీసుకున్నారు. దీనిపై నాగేందర్ ఫైర్ అయ్యారు. తాను
కేబినెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు
కుదరదని కరాఖండీగా చెప్పి ఇప్పుడు వ్యాట్ను తగ్గిస్తూ నిర్ణయం
తీసుకోవడం ఏమిటని ఆయన మండిపడుతున్నారు. కొందరు
సన్నిహితుల వద్ద ఆయన దీన్ని
ప్రస్తావిస్తున్నారట.
సహచర
మంత్రులంటే ముఖ్యమంత్రికి గౌరవం లేకుంటే ఎలా
అని ప్రశ్నిస్తున్నారట. ఇదే విషయమై ఆర్థిక
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితోనూ,
ఆ శాఖ అధికారులతోనూ మాట్లాడారని
అంటున్నారు. కేబినెట్లో ఈ అంశాన్ని
ప్రస్తావించేవరకూ నిర్ణయం అమలు కాకుండా నిలుపుదల
చేయాలని నాగేందర్ డిమాండ్ చేస్తున్నారు.
కాగా
సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి
ఆనం రామనారాయణ రెడ్డి వేరుగాచెప్పారు. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం
సోమవారం సచివాలయంలో భేటీ అయింది. ఈ
సమావేశానికి మంత్రులు ఆనం, దామోదర రాజనర్సింహ,
రఘువీరా రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆనం విలేకరులతో మాట్లాడారు.
ఉద్యోగసంఘాల
డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని అయితే వారానికి
ఐదు రోజుల పని దినాల
డిమాండ్ను అమలు చేయలేమని
స్పష్టం చేశారు. మిగిలిన రెండు డిమాండ్లను పరిశీలిస్తున్నట్లు
చెప్పారు. సచివాలయంలోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లకు వేతనాల పెంపు, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్లకు కారువసతి కల్పించే విషయమై ఇంకా తుది నిర్ణయం
తీసుకోలేదని చెప్పారు.
0 comments:
Post a Comment