స్టేడియంలో
సిగరెట్ తాగినందుకు బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్కు జైపూర్ కోర్టు
గురువారం నోటీసులు జారీ చేసింది. జైపూర్
లోని స్వాభిమాన్ స్టేడియంలో ఏప్రిల్ 8న రాజస్థాన్ రాయల్స్,
కోల్‌కతా నైట్ రైడర్స్
మధ్య మ్యాచ్ సందర్భంగా షారుఖ్ అందరి మధ్య సిగరెట్లు
కాల్చారు.
బహిరంగంగా
పొగ తాగకూడదన్న నిబంధనలను ఉల్లంఘించారని ఆయనపై ఇక్కడి స్థానిక
కోర్టులో జైపూర్ క్రికెట్ అకాడెమీ డైరెక్టర్ ఆనంద్ సింగ్ రాథోడ్
తరఫున న్యాయవాది నేంసింగ్ రాథోడ్ ఈ కేసు దాఖలు
చేశారు. ఈ మేరకు ఈ
రోజు కోర్టు నోటీసులు జారీ చేసింది.
'2000 సంవత్సరం
నుంచి రాజస్థాన్ లో బహిరంగ ధూమపానంపై
నిషేధం ఉంది. అయినా షారుఖ్
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వేలాదిమంది ప్రేక్షకుల ముందే సిగరేట్లు కాల్చారు.
దీనిని మ్యాచ్ ప్రసారం చేసిన చానెళ్ల కూడా
చూపించింది' అని కేసు వేసిన
న్యాయవాది నేంసింగ్ రాథోడ్ తెలిపారు.
తాగకూడదన్న
నిబంధనలను ఉల్లంఘించడం షారుఖ్కు ఇది కొత్తేమీ
కాదు. గతంలో చాలా సందర్భాల్లో
షారుఖ్ ఇలాంటి వివాదాలు ఎదుర్కొన్నారు. ఆయన గురించి తెలిసిన
వారంతా షారుఖ్ స్మోకింగ్ కు బానిసయ్యాడు. ఆయన
స్మోక్ చేయకుండా ఉండలేడు అని అంటున్నారు. మరి
కోర్టు నోటీసులపై షారుఖ్ ఖాన్ స్టెప్స్ ఎలా
ఉంటాయో చూడాలి.
0 comments:
Post a Comment