హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆయన కేబినెట్లో
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో
ప్రధాన నిందితుడు భాను కిరణ్, పరిటాల
రవిపై హత్యాయత్నం కేసులో ఐదేళ్ల శిక్ష పడిన మంగళి
కృష్ణలు ఉంటారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్కు తాను
ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం తప్ప ప్రజా సమస్యలు
పట్టవన్నారు.
జగన్కు కావాల్సింది సిఎం
పదవి అన్నారు. అదే జరిగితే జగన్
మంగళి కృష్ణ హోంశాఖ, భాను
కిరణ్కు సినిమాటోగ్రఫి, గాలి
జనార్ధన్ రెడ్డికి గనుల శాఖ, అంబటి
రాంబాబుకు మహిళా శిశు సంక్షేమం,
విజయ సాయి రెడ్డికి ఆర్థిక
శాఖ, రవీంద్రా రెడ్డికి వ్యవసాయ శాఖలను ఇస్తారని సెటైర్ వేశారు. తాను ముఖ్యమంత్రిని అయితే
అంటూ జగన్ నిత్యం వల్లిస్తున్నారని,
దానిని విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
అధికారంలోకి
వస్తే ఆత్మహత్యలు లేకుండా చేస్తానని జగన్ అంటున్నారని, కానీ
తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
హయాంలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగిన విషయం తెలుసుకోవాలన్నారు. నీ అనుచరుల
బెదిరింపుల వల్లే మస్తాన్ రావు
ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. బెదిరింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న
జగన్ ఆయన కుటుంబాన్ని ఎప్పుడైనా
పరామర్శించారా అన్నారు.
ఇనుప
ఖనిజం లారీలు ఢీకోని 250 మంది చనిపోతే ఓధార్చలేదన్నారు.
జగన్ తాను అనుకున్న వారినే
ఓదార్చుతాడన్నారు. బాధపడే వారిని ఓదార్చే లక్ష్యం ఆయనకు లేదన్నారు. పులివెందుల,
కడపలలో సూరి, జగన్ మనుషులు
ఉన్నారన్నారు. జగన్ అనుచరుల బెదిరింపులతో
సినిమా, పరిశ్రమలు ఇలా ఏ రంగానికి
రక్షణ లేకుండా పోయిందన్నారు. అన్ని పాపాలకు ఒడిగట్టిన
జగన్ ముఖ్యమంత్రిని అవుతాను అంటున్నాడన్నారు.
1 నుంచి
పిజి వరకు విద్యార్థులకు ఫీజులు
కడతానన్న జగన్ వ్యాఖ్యలపై సోమిరెడ్డి
చురక వేశారు. అసలు రాష్ట్రంలో ఎంతమంది
విద్యార్థులు ఉన్నారో, వారికి ఎంత ఫీజులు అవుతుందో
తెలుసా అని ప్రశ్నించారు. ఇలాంటి
వ్యక్తి ఫీజులు కడతాడంట, అందరినీ కలెక్టర్లను చేస్తాడంట అన్నారు. ఎలా చేస్తాడో చెప్పాలన్నారు.
వైయస్ హయాంలో హైదరాబాద్ చుట్టుపక్కల భూములను ఆయన కుటుంబం కాజేసిందన్నారు.
జగన్ మాటలు పిచ్చోడిలా ఉన్నాయన్నారు.
రాష్ట్రం
ఏమైనా జగన్కు పట్టదని,
ఆయనకు కావాల్సింది ఓట్లు మాత్రమే, భారీ
ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించడమే అన్నారు. బోఫోర్స్ కుంభకోణంలో యాభై కోట్ల ముడుపులు
అందితే, మరో కేసులో మధుకొడా
కేసులో సంచలనం అయ్యాయని జగన్ మాత్రం అంతకంటే
అక్రమంగా సంపాదించినా పట్టడం లేదన్నారు. జగన్ ఆస్తుల కేసులో
నంబర్ వన్ ముద్దాయి అన్నారు.
జగన్ నీతి వ్యాఖ్యలు వల్లిస్తుంటే
నవ్వొస్తుందన్నార.
ఆరేళ్లు
రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. పెద్ద కాంగ్రెసు దేశాన్ని,
చిన్న కాంగ్రెసు రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. సాక్షిలో తమ పార్టీ అధినేత
నారా చంద్రబాబునాయుడు వార్తలు తప్ప మరొకటి మొదటి
పేజీలో కనిపించవన్నారు. జగన్ ఆస్తుల కేసులో
పత్రికలు అన్ని మొదటి పేజీలో
ఇస్తే సాక్షి మాత్రం ఆ రోజు కూడా
చంద్రబాబు వార్తే ఇచ్చిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పరిటాల రవి,
సూటుకేసు బాంబు తదితర కేసులపై
సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
దోపిడీదారుల
నుండి రాష్ట్రాన్ని కాపాడాల్సి ఉందన్నారు. ఈ దుర్మార్గ పరిస్థితి
నుండి తప్పించాలన్నారు. హత్యలు, ఆర్థిక నేరాల పాపం జగన్దే అన్నారు. జగన్కు ఆస్తులు కూడబెట్టిన
వారు ఇప్పుడు జైళ్లలో మగ్గుతున్నారన్నారు. ఇది వరకు సిబిఐ
కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందనే ఆరోపణలు ఉండేవని,
కానీ ఇప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటున్నందున మార్పు వస్తుందన్నారు.
వైయస్
తెలంగాణ భూములను దోచుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీని
తిట్టడం మినహా దోపిడీదారులను మాత్రం
ప్రశ్నించడం లేదన్నారు. మేం ప్రాంతాలకు అతీతంగా
పోరాటం చేస్తున్నామన్నారు. తెరాస మాత్రం తెలంగాణవాదం
అంటూనే దోపిడీ చేస్తున్నప్పటికీ పట్టనట్లుగా ఉందన్నారు.
రాష్ట్రంలో
ఫ్యాక్షన్ హత్యలన్నీ పులివెందులతోనే ముడివడి ఉన్నాయని పయ్యావుల కేశవ్ వేరుగా అన్నారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులకు బుద్ధి చెప్పాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి కడపలో ప్రజలకు పిలుపునిచ్చారు.
గతంలో వైయస్ను విమర్శించిన
నాయకులే ఇప్పుడు జగన్ పార్టీలో చేరి
వైయస్ను పొగుడుతున్నారన్నారు.
0 comments:
Post a Comment